'సాహో'పై పోటీకి దిగి - టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాడు నాగార్జున. సరిగ్గా సాహో టీజర్ విడుదల రోజునే - మన్మథుడు 2 టీజర్‌ని బయటకు వదిలాడు నాగ్. 'సాహో' రిలీజ్‌కి వారం ముందు తన సినిమాని బరిలోకి దింపాడు. సాహో దెబ్బకు పెద్ద సినిమాలు హడలిపోతున్నారు. సాహోకి వారం ముందు, వారం తరవాత సినిమాలేవీ లేకుండా జాగ్రత్తపడుతున్నారు. అయితే నాగ్ మాత్రం ఆగస్టు 9న 'మన్మథుడు 2' విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. సరిగ్గా వారం తరవాత 'సాహో' వస్తున్నా - థైర్యంగా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడు.
అయితే ఇప్పుడు నాగ్ వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. 'మన్మథుడు 2' రిలీజ్ డేట్ మార్చడానికి నాగ్ సిద్ధమయ్యాడని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ వస్తుందని తెలుస్తోంది. పంపిణీదారుల సలహా మేరకే.. నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. సాహోకి పోటీ పడడం మంచిది కాదని, మన్మథుడు 2కి రెండో వారంలో థియేటర్లు దొరక్కుండా పోతాయని, సినిమా బాగున్నా - క్యాష్ చేసుకోలేని పరిస్థితి వస్తుందని నాగ్‌కి పంఫిణీదారులు చెప్పారట. దాంతో నాగ్.. రిలీజ్ డేట్ విషయంలో వెనుకడుగు వేశాడని సమాచారం.