ఈ నెల 21 నుండి తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 బుల్లితెరపై ప్రసారమయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ రియాల్టీ షోని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు కేసుల రూపంలో సన్నధ్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ షోని నిలిపివేయాలంటూ కొన్ని కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు బిగ్‌బాస్‌ని చుట్టుముట్టింది. ఈ కేసు బిగ్‌బాస్ మెడకు కాస్త బలంగానే చుట్టుకునేలా కనిపిస్తోంది.
షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునతో పాటు, మరో 10 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ, బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లలో ఓ వ్యక్తి తాజాగా కేసు వేశారు. అసభ్యకరమైన సన్నివేశాలుండడంతో, రాత్రి 11 గంటల తర్వాతే ఈ షోని ప్రసారం చేయాలని ఫిటిషనర్ తన ఫిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, సినిమాకి ఉన్నట్లుగానే ఈ షోలోని ప్రతీ ఎపిసోడ్‌నీ సెన్సార్ చేయాలనీ సదరు వ్యక్తి కోరారు.
అయితే, తమపై వేసిన కేస్‌ని కొట్టివేయాలని కోరుతూ బిగ్‌బాస్ కోఆర్టినేషన్ టీమ్ హైకోర్టులో తాజాగా మరో ఫిటీషన్ వేసింది. గత రెండు సీజన్స్‌లోనూ ఈ తరహా కేసులు బిగ్‌బాస్ షోని వేధించలేదు. కానీ, ఈ సీజన్‌లో ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా ప్రసారం కాకుండానే ఇన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇక వన్స్ స్టార్ట్ అయ్యాకా బిగ్‌బాస్ ఇంకెన్ని వివాదాలని ఎదుర్కోవాల్సి వస్తుందో వేచి చూడాలిక.