'ఇస్మార్ట్‌ శంకర్‌' ముందు జాగ్రత్త అదిరిందిలే!

మరిన్ని వార్తలు

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని - డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌' చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ జర వేగవంతమైన సంగతి తెలిసిందే. పక్కా తెలంగాణా పాత బస్తీ స్టైల్‌లో ఈ సినిమా రూపు దిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. హీరో క్యారెక్టర్‌ డిజైన్‌ దగ్గర్నుంచీ, డైలాగులూ, నేటివిటీ.. అంతా పక్కా హైద్రాబాదీ స్టైల్‌లో చూపిస్తున్నాడు ఈ సినిమాని పూరీ జగన్నాధ్‌.

 

అయితే, హీరో క్యారెక్టర్‌ విషయానికి వస్తే, చాలా రఫ్‌గా, టఫ్‌గా పక్కా మాస్‌ మార్క్‌లో కనిపిస్తూ, మందూ, విందూ, పొందుతో పాటు, మాస్త్‌గా దమ్ము కూడాల లాగేస్తున్నాడు. షూటింగ్‌ సమయంలో ఓపెన్‌గా దమ్ము కొట్టినందుకు ఈ సినిమాకి సంబంధించి, ట్రాఫిక్‌ పోలీసులకు చలాన్‌ కూడా కట్టాడు మన హీరో రామ్‌ పోతినేని. ఇక ఇప్పుడు రామ్‌ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. స్టేట్‌మెంట్‌ అంటే స్టేట్‌మెంట్‌ కూడా కాదులెండి, ఓ స్వీట్‌ వార్నింగ్‌ అనుకోవాలేమో. సినిమాలో హీరో ఇష్టమొచ్చినట్లు దమ్ము కొట్టేస్తుంటాడు.

 

అలా బయట మాత్రం కొట్టొద్దనీ, 'ధూమపానం ఆరోగ్యానికి హానికరం..' అనీ రామ్‌ చెబుతున్నాడు. ఇది కేవలం సినిమా కోసం చేసిన యాక్టింగ్‌ తప్ప నిజం కాదనీ, సినిమాని సినిమాగానే తీసుకోవాలనీ, ఇస్మార్ట్‌ శంకర్‌ అనేది కేవలం ఓ కల్పిత పాత్ర మాత్రమే, హైద్రాబాదీ కుర్రాళ్లందరూ ఇలాగే ఉంటారని చెప్పడం తమ ఉద్దేశ్యం కాదనీ రామ్‌ సూచిస్తున్నాడు. మొత్తానికి భలే ఇస్మార్టండోయ్‌. ఎందుకొచ్చిన గొడవలే అనుకున్నాడో ఏమో, ముందు జాగ్రత్తగా ఆలోచించి తనదైన శైలిలో ఇస్మార్ట్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS