బిగ్‌ ఎలిమినేషన్‌: ఈ వారం అవుట్‌ అయ్యేదెవరంటే!

మరిన్ని వార్తలు

గత నెలరోజులుగా మస్త్‌ మజాగా నడుస్తోన్న బిగ్‌బాస్‌ సీజన్‌ 3, ఐదో ఎలిమినేషన్‌కి సమయం వచ్చింది. ఈ సారి ఎలిమినేషన్‌లో రాహుల్‌, బాబా భాస్కర్‌, పునర్నవి, హిమజ, ఆషూ, శివజ్యోతి, మహేష్‌ ఉన్నారు. వీరిలో హౌస్‌ నుండి ఎవరు బయటికి వెళతారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే, హౌస్‌ నుండి ఎవరు బయటికొస్తారన్న విషయం ముందే సోషల్‌ మీడియాలో లీక్‌ అయిపోతోంది.

 

ఆ లీకేజీకి తగ్గట్లుగానే ఎలిమినేషన్‌ జరుగుతోంది. ఈ సారి లీకులో భాగంగా, హిమజ, ఆషూరెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఓట్ల పరంగా ఆషూకి తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. కానీ, గతవారం ఎలిమినేషన్‌ తీసుకుంటే, తక్కువ ఓట్లు వచ్చిన శివజ్యోతిని సేవ్‌ చేసి, ఎక్కువ ఓట్లు వచ్చిన రోహిణిని బయటికి పంపించారు. అదే ఈక్వేషన్‌ కంటిన్యూ అయితే, ఈ సారి ఆషూ సేఫ్‌ అయ్యి, హిమజ బయటికి వెళ్లాల్సి వస్తుందేమో.. అనే ప్రచారం జరుగుతోంది. ఇంతవరకూ హౌస్‌లో డల్‌గా ఉంటూ వచ్చిన ఆషూ రెడ్డి ఈ మధ్య కాస్త యాక్టివ్‌ అయ్యింది. కొన్ని కొన్ని ఇష్యూస్‌లో తనదైన స్టాండ్‌ తీసుకుంటోంది.

 

గొడవలకు తానూ ఓ కారణమవుతూ వస్తోంది. ఇక్కడి మాటలు అక్కడా, అక్కడి మాటలు ఇక్కడా చెప్పడంలో తానేం తక్కువ కాదనే అభిప్రాయం వినిపిస్తోంది రెగ్యులర్‌గా బిగ్‌బాస్‌ వాచ్‌ చేసే ఆడియన్స్‌ నుండి. ఇక హిమజ విషయానికి వస్తే, ఓ వింత ఆటిట్యూడ్‌తో కనిపిస్తూ వచ్చింది. తాజా ఎపిసోడ్‌లో సీక్రెట్‌ టాస్క్‌లో భాగంగా, ఇమ్యూనిటీ పొందే అవకాశం కోల్పోయింది. సో సిట్యువేషన్స్‌ చూస్తుంటే, ఈ వారం హౌస్‌ నుండి బయటికి వచ్చేది హిమజనే అని నెటిజన్స్‌ గెస్‌ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS