అందుకే జబర్‌దస్త్ కామెడీ షో నుంచి ఆయన బయటకు వచ్చేశారా? ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో ఇదే ఆసక్తికరమైన చర్చ. తెలుగువాళ్లకు జబర్‌దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేటింగుల్లో ఇదే నెంబర్ వన్. ఈ షోలో నాగబాబు, రోజాలు ప్రధాన ఆకర్షణలు. ఈ షోకి శాశ్వత జడ్జ్‌లు వాళ్లే. వీరిద్దరి నవ్వులతో ఈ షోకి మరింత శోభ వస్తుంటుంది. అయితే... ఇప్పుడు ఈ షో నుంచి నాగబాబు తప్పుకున్నారు. మల్లెమాల టీమ్ (శ్యాంప్రసాద్ రెడ్డి బృందం)తో నాగబాబుకు విబేధాలొచ్చాయని తెలుస్తోంది. బబర్‌దస్త్‌లోని ప్రతీ టీమ్‌కీ ఒకరిద్దరు దర్శకులు ఉంటారు. వాళ్లే... స్కిట్లని రాసి, డైరెక్షన్ చేస్తుంటారు. వాళ్లలో కొంతమందిని మల్లెమాల టీమ్ తొలగించిందని సమాచారం. అలా తొలగించడం నాగబాబుకి నచ్చలేదట. ఈ తొలగింపు జబర్‌దస్త్‌లో చాలామందికి నచ్చలేదని, వాళ్లంతా నాగబాబు దగ్గరకు వెళ్లి న్యాయం చేయమని అడిగారని తెలుస్తోంది. ఈ విషయమై నాగబాబు మల్లెమాల టీమ్‌తో మాట్లాడినా ప్రయోజనం లేకపోయిందట. దాంతో నాగబాబు ఈ షో నుంచి తప్పుకోవాల్సివచ్చిందని తెలుస్తోంది. నాగబాబుకి సన్నిహితులుగా ఉన్న సుధీర్, రాం ప్రసాద్, చంటిలు కూడా ఈ షో విషయంలో ఇప్పుడు ఆలోచిస్తున్నారని, చేయాలా, వద్దా? అనే విషయంలో తర్జన భర్జనలు పడుతున్నారని సమాచారం.