బుల్లితెర 'రాములమ్మ' బిగ్‌బాస్‌కే 'జేజమ్మ'.!

By iQlikMovies - July 22, 2019 - 11:04 AM IST

మరిన్ని వార్తలు

బుల్లితెరపై రాములమ్మగా పిచ్చ పాపులారిటీ ఉన్న శ్రీముఖి ఇప్పుడు బిగ్‌హౌస్‌లో సందడి చేయనుంది. గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌లో ఒకరిగా శ్రీముఖి నిజంగానే బిగ్‌ హౌస్‌కి స్పెషల్‌ ఎంట్రీ ఇచ్చేసింది. కలర్‌ఫుల్‌ కాస్ట్యూమ్‌లో గ్రాండ్‌గా శ్రీముఖి ఎంట్రీ ప్లాన్‌ చేశారు. శ్రీముఖి సైనింగ్‌ సాంగ్‌ రాములమ్మ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తూ, ఫుల్‌ జోష్‌గా శ్రీముఖి బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రవేశించింది.

 

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌లో శ్రీముఖి పేరు టాక్‌లోకి రావడంతో పాటే, ఆమె గ్యాంగ్‌ కూడా ఫామ్‌ అయిపోయిందనే ప్రచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. శ్రీముఖి ఆర్మీ పేరిట ఓ టీమ్‌ సిద్ధమైపోయిందంటూ వార్తలొచ్చాయి. ఇక ఎట్టకేలకు బుల్లితెర రాములమ్మ బిగ్‌బాస్‌లో జేజమ్మగా ఎంట్రీ ఇచ్చేసింది. అంతే, ఇంకేముంది, సోషల్‌ మీడియాలో శ్రీముఖి ఆర్మీ కాస్తా, 'శ్రీముఖి మాఫియా'గా రూపాంతరం చెంది, యాక్టివ్‌ అయిపోయింది.

 

ఇక శ్రీముఖితో పాటు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ అంటూ ఇంతకాలంగా ప్రచారంలో ఉన్న వారందరికీ చోటు దక్కింది. టీవీ 9 రిపోర్టర్‌ జాఫర్‌, నటి హేమ, హిమజ, పునర్నవి, మహేష్‌ విట్టా, సింగర్‌ రాహుల్‌, ఇద్దరు సీరియల్‌ మేల్‌ ఆర్టిస్టులు అలీ రెజా, రవికృష్ణతో పాటు, రోహిణి, బాబా భాస్కర్‌లతో పాటు, వరుణ్‌ సందేశ్‌, వితికా షెరూ (వైఫ్‌ అండ్‌ హజ్‌బెండ్‌), అషూ రెడ్డి (సోషల్‌ మీడియా సెన్సేషన్‌), శివజ్యోతి (సావిత్రక్క) ఇలా 15 మంది కంటెస్టెంట్స్‌ బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో సందడి చేసేందుకు సిద్ధమైపోయారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS