టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, మహానటి మినహాయిస్తే... విజయ్ నటించిన సినిమాలన్నింటిలోనూ ముద్దులున్నాయి. అర్జున్ రెడ్డిలో అయితే దాదాపు 20 ముద్దు సీన్లు ఉంటాయి. గీత గోవిందం ముద్దు చుట్టూ నడిచే కథ. టాక్సీవాలాలోనూ ముద్దుల ఘాటు చూపించాడు. ఇప్పుడు `డియర్ కామ్రేడ్`లోనూ ముద్దులకు లోటు చేయలేదు. విజయ్ సినిమా అంటే ముద్దులు ఉండాల్సిందే అన్నట్టు తయారైంది పరిస్థితి. వీటిపై విజయ్ కూడా స్పందించాడు.
తన సినిమాల్లో ముద్దులు కథకు లోబడే ఉంటాయని, ముద్దన్నది ఓ అద్భుతమైన భావన అని, మాటల్లో ప్రేమని వ్యక్తపరచలేనప్పుడు ముద్దులు అవసరం అవుతాయని, అలాంటి సన్నివేశాల్లో ముద్దులు ఉండాల్సిందేనని అంటున్నాడు విజయ్ దేవరకొండ. ముద్దు సన్నివేశాల్లో నటించడానికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటపడనని, కావాలని పెట్టిన ముద్దుల్ని ప్రేక్షకులు కూడా తిరస్కరిస్తారని చెప్పుకొచ్చాడు. విజయ్ దూకుడు చూస్తుంటే... ముద్దు లేనిదే.. సినిమా ఒప్పుకోడేమో అనిపిస్తోంది. మున్ముందు వెండి తెరపై ఇంకెంతగా ముద్దుల వర్షం కురిపిస్తాడో చూడాలి.