ఆ యంగ్‌హీరోని టెన్షన్‌ పెడుతున్న 'శంకర్‌'?

మరిన్ని వార్తలు

జూలై 12న విడుదల కావల్సిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' మరో వారం పోస్ట్‌ పోన్‌ చేసుకుని జూలై 18కి రిలీజ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. కారణం ఏదైతేనేం ఈ మార్పు మరో యంగ్‌ హీరోని టెన్షన్‌ పెట్టేస్తోంది. ఆయన మరెవరో కాదు, ఆరడుగుల ఆజానుబాహుడు బెల్లంకొండ వారసుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. ఈయన హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'రాక్షసుడు'. తమిళ బ్లాక్‌ బస్టర్‌ 'రాచ్చసన్‌'కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. రీమేక్‌ సినిమా కావడంతో పెద్దగా టైం తీసుకోలేదు. చాలా ఎర్లీగా నిర్మాణం పూర్తి చేసుకుని సినిమాని రిలీజ్‌ బరిలో ఉంచారు 'రాక్షసుడు' టీమ్‌.

 

తమిళంలో మంచి విజయం సాధించినా, తెలుగులో ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. టీజర్‌ విడుదలయ్యాక ఒకింత ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసినా, తర్వాత సింపుల్‌గా లైట్‌ తీసుకున్నారు ఈ సినిమాని. సీరియల్‌ కిల్లర్‌ కథాంశంతో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అసలు వివరాల్లోకి వెళితే, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమాని జూలై 18న విడుదల చేసేందుకు డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నారు బెల్లంకొండ అండ్‌ టీమ్‌. అయితే సరిగ్గా అదే టైంకి అనూహ్యంగా రిలీజ్‌ని మార్చుకుంది 'ఇస్మార్ట్‌ శంకర్‌'. పూరీ, రామ్‌ల కాంబినేషన్‌లో ఊర మాస్‌ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈ సినిమాపై మొదట్నుంచీ అంచనాలున్నాయి.

 

ఇక విడుదల టైం దగ్గర పడేకొద్దీ, చిత్ర యూనిట్‌ చేస్తున్న ప్లానింగ్‌ ప్రమోషన్స్‌తో సినిమాపై బజ్‌ బాగా పెరిగింది. దాంతో మనోడు అదేనండీ బెల్లంకొండ శ్రీనివాస్‌ పాపం చిక్కుల్లో పడ్డాడు. పూరీ సినిమా అంటే ఎంత కాదనుకున్నా అంచనాలుంటాయి. అందులోనూ 'ఇస్మార్ట్‌ శంకర్‌' ఇప్పటికే బాగా ఎట్రాక్ట్‌ చేసేస్తోంది. ఈ తరుణంలో తన సినిమాని పట్టించుకుంటారా.? అనే ఆలోచనలో పడ్డాడట. ఈ ఆలోచనను ఏమైనా డెవలప్‌ చేస్తే, 'రాక్షసుడు' రిలీజ్‌ డేట్‌లో ఛేంజెస్‌ ఏమైనా ఉంటాయేమో వేచి చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS