రెండో ఎలిమినేషన్‌గా జాఫర్‌ని బిగ్‌హౌస్ నుండి బయటికి పంపించారు. తొలి ఎలిమినేషన్‌లో భాగంగా, ఎలిమినేట్ అయిన సీనియర్ నటి హేమ, బిగ్‌బాస్‌లోకి వెళ్లి 'బ్యాడ్' అనే ముద్ర వేయించుకుంది. బిగ్‌బాస్‌కెళితే, బ్యాడ్ ముద్రతోనే తిరిగి బయటికి వచ్చేది అనే ప్రచారం గత సీజన్ నుండీ కొనసాగుతూనే ఉంది. అయితే, ఈ సీజన్‌లోనూ అదే ట్రెండ్ హేమ వరకూ కూడా కొనసాగింది. కానీ, రెండో ఎలిమినేషన్ విషయానికి వచ్చేసరికి ఆ ట్రెండ్‌ని తప్పించాలనుకున్నారో ఏమో, జాఫర్‌ని 'మంచోడు' అంటూ బయటికి పంపించారు. బయటికి వస్తున్న జాఫర్‌ని వదలలేక, హౌస్ మేట్స్ అందరూ పట్టుకుని ఏడ్చేశారు.
దాంతో బిగ్‌హౌస్‌లో ఓవరాక్షన్ కాస్త ఎక్కువైందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, హౌస్ నుండి బయటికి వస్తూ, జాఫర్ తన బుద్దిని బయట పెట్టుకున్నాడు. శ్రీముఖిని ఏమీ అనొద్దంటూ వితిక పైనా, బాబాని ఏమీ అనొద్దంటూ వరుణ్ పైనా నిందలు మోపాడు. దాంతో వరుణ్, వితిక షాకయ్యారు. జాఫర్‌తో పాటు, ఎలిమినేషన్‌లో వరుణ్, వితిక కూడా ఉన్నారు. వారిద్దరూ సేవ్ అయ్యి, జాఫర్ హౌస్ నుండి బయటికి రావల్సి వచ్చిందన్న అక్కసుతోనే, ఆ ఫ్రస్టేషన్‌లో ఆయన అలా అనేసి ఉంటాడని, వరుణ్ తనకు తాను సర్ది చెప్పుకున్నాడు
వితికను సముదాయించాడు. కానీ, వరుణ్, వితికలపై అలాంటి బాంబ్ వేసేసి హౌస్ నుండి బయటికి రావడం పట్ల జాఫర్‌ని బయటి నుండి, నెటిజన్లు తప్పు పడుతున్నారు. మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్‌లో కొత్తగా చోటు చేసుకున్న ఈ అంశం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది.