శ‌ర్వా బిస్కెట్లు... అటు ప‌వ‌న్‌కీ... ఇటు త్రివిక్ర‌మ్‌కీ!

మరిన్ని వార్తలు

సినిమా ఫంక్ష‌న్ అంటేనే పొగ‌డ్త‌ల కార్య‌క్ర‌మంలా త‌యారైపోతోంటుంది. యాంక‌ర్లు హీరోల్ని, హీరోయిన్ల‌నీ, ద‌ర్శ‌కుల్నీ ఆకాశానికి ఎత్తేస్తుంటారు. వాళ్ల‌కు డ‌బ్బులు ఇచ్చేది అందుకే కాబ‌ట్టి - ఆ ప్ర‌యాస‌ని అర్థం చేసుకోవ‌చ్చు. స్టేజీ ఎక్కిన అతిథులు కూడా అంతే. వాళ్ల‌ని వేడుక‌కు పిలిచింది అందుకే కాబ‌ట్టి - వ‌చ్చిన ప‌నికి వాళ్లూ న్యాయం చేసేసిన‌ట్టు. ఇప్పుడు హీరోలు కూడా పొగ‌డ్త‌ల కార్య‌క్ర‌మంలో దిగిపోయారు. తాజాగా ఈ లిస్టులో శ‌ర్వానంద్ కూడా చేరిపోయాడు. శ‌ర్వా క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `ర‌ణ‌రంగం`. ట్రైల‌ర్ విడుద‌ల వేడుక కాకినాడ‌లో జ‌రిగింది.

 

ఈ కార్య‌క్ర‌మానికి త్రివిక్ర‌మ్ అతిథిగా వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా శ‌ర్వా కొన్ని విష‌యాలు చెప్పుకొచ్చాడు. తాను సినిమా వేషాల కోసం తిరుగుతున్న‌ప్పుడు త్రివిక్ర‌మ్‌ని క‌లుసుకునేవాడ్ని అని, అప్ప‌టికి ఆయ‌న ద‌ర్శ‌కుడు అవ్వ‌లేద‌ని, `నాకోసం ఏమైనా పాత్ర‌లు రాయండి` అంటే... నీకు హీరో పాత్ర‌లు మాత్ర‌మే ఇస్తా.. అని చెప్పేవాడ‌ని గుర్తు చేసుకున్నాడు. అంటే.. త్రివిక్ర‌మ్ తో ప‌నిచేయాల‌న్న విష‌యాన్ని ప‌రోక్షంగా గుర్తు చేస్తూ... ఓ బిస్కెట్ వేశాడ‌న్న‌మాట‌.

 

ఈ స్పీచ్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది. సినిమాల్లోకి రాక మునుపు ప‌వ‌న్ క‌ల్యాణ్ షూటింగుల‌కు వెళ్లేవాడ్ని అని, ప‌వ‌న్‌ని క‌లిసినప్పుడు అదే విష‌యాన్ని గుర్తు చేశార‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ సింప్లిసిటీ సూప‌ర్ అనీ, ప్ర‌జ‌ల కోసం ఆయ‌న సుఖాల‌న్నీ మానేసి రాజ‌కీయాల్లోకి వచ్చార‌ని... ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడు. శ‌ర్వా సినిమా ఈనెల 15న విడుదల అవుతోంది. ఈ సినిమా కోసం రెండేళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు శ‌ర్వా. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS