తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిన బుల్లితెర మెగా గేమ్ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్‌కి రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ సీజన్ హోస్ట్ ఎవరనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా కోడి ముందే కూసేస్తోంది. ఈ సారి హోస్ట్ సూపర్ స్టార్ మహేష్‌బాబు అంటూ టామ్ టామ్ ధూమ్ ధామ్ చేసేస్తోంది. మరి, నిజంగానే నాలుగో సీజన్ బిగ్‌బాస్‌కి హోస్ట్ గా సూపర్ స్టార్ ఫిక్సయ్యారా.? ఇకపోతే, తొలి సీజన్‌ని స్టార్ కంటెస్టెంట్స్‌తో రన్ చేశారు. సో సోగా నడిచింది. రెండో సీజన్‌కొచ్చేసరికి బిగ్‌బాస్ యమా క్రేజ్ దక్కించుకుంది. లవ్ స్టోరీలు, క్యారెక్టర్ డెస్టినేషన్లూ అంటూ రెండో సీజన్‌కి తెగ కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్.
ఇక మూడో సీజన్ వచ్చేసరికి ఆ క్రేజ్ మరింత ఎక్కువయిపోయింది. కొంచెం పర్సనల్‌గా తీసేసుకున్నారు. అలా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ని విజేతగా నిలబెట్టి, ఆడియన్స్ తడాఖా ఏంటో చూపించారు. అలా ఏర్పడిన బిగ్‌బాస్ క్రేజ్‌ని నిర్మాతలు బాగానే క్యాష్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సీజన్‌కి మరింత గ్లామర్, కాంట్రవర్సీలు అద్ది, క్యూరియాసిటీ క్రియేట్ చేసేందుకు తగిన కంటెస్టెంట్స్ వేట ఆల్రెడీ స్టార్ట్ చేసేశారట. హోస్ట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి, ఆ క్యూరియాసిటీని అంచెలంచెలుగా కంటిన్యూ చేయాలనుకుంటున్నారట. ఆ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్‌బాబు పేరు హోస్ట్‌గా తెరపైకి వచ్చింది. మరి బిగ్‌బాస్ హోస్ట్‌గా మహేష్ ఒప్పుకుంటారా.? చూడాలి మరి.