బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్ళే కంటెస్టెంట్స్ బీభత్సమైన నెగెటివిటీని మూటగట్టుకుంటారన్నది వెనకటి మాట. ఈసారి అలాంటి వాతావరణమే కనిపించడంలేదు. ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయినా, వారి పట్ల విపరీతమైన పాజిటివిటీ క్రియేట్ అవుతోంది. ‘సూర్యకిరణ్ ఇంకో రెండు వారాలైనా వుండి వుండాల్సింది..’ అన్నారు మొదట్లో. ఆ తర్వాత కరాటే కళ్యాణి విషయంలో ఇప్పటికీ చాలామంది బిగ్‌బాస్ ఫాలోవర్స్, ‘ఆమె ఇంకా వుంటే బావుండేది’ అంటున్నారు.
దేవి నాగవల్లి విషయంలో అయితే, నిర్వాహకుల మీద చాలామంది బిగ్‌బాస్ ఫాలోవర్స్ తీవ్రమైన విమర్శలు చేశారు. టైటిల్ గెలవాల్సిన దేవిని ముందే పంపేశారంటూ.. ఇప్పటికీ విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. తాజాగా కుమార్ సాయి విషయంలోనూ అలాంటి రెస్పాన్సే వస్తోంది. మోనాల్ గజ్జర్, అమ్మ రాజశేఖర్, అఖిల్ తదితరులతో పోల్చితే కుమార్ సాయి చాలా బెటర్ కంటెస్టెంట్స్ అన్నది మెజార్టీ అభిప్రాయం. ‘బ్రింగ్ బ్యాక్ కుమార్ సాయి’ అంటూ పెద్ద ఉద్యమమే నడుస్తోంది.. గతంలో అలీ రెజాకి జరిగినట్లు. కానీ, ఈ సీజన్‌లో రీ-ఎంట్రీలు కష్టం. ఎందుకంటే, కరోనా ఎఫెక్ట్ వుంది మరి. నిజానికి, టాప్ ఫైవ్ లిస్ట్‌లో వుండాల్సినోడు కుమార్ సాయి.
బీభత్సమైన ఎంటర్‌టైన్‌మెంట్ చివరి రోజు ఇచ్చేసి, హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ‘నేనోడిపోయాను..’ అంటూ కొంత ఆవేదన వ్యక్తం చేసినా, ఓవరాల్‌గా చాలా కూల్‌గానే షో నుంచి బయటకు వచ్చాడు కుమార్ సాయి. మోనాల్‌నీ, అఖిల్‌నీ పంపించేసి, కుమార్ సాయిని హౌస్‌లో వుంచేస్తే బావుండేదన్న డిమాండ్ ఇప్పటికీ గట్టిగానే వినిపిస్తోంది.