బిగ్‌ స్ట్రాటజీ: బాబోయ్‌ అనేలా బాబా భాస్కర్‌ స్ట్రేటజీ!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో బాబా భాస్కర్‌ది ఓ సెపరేట్‌ రూటు. మొదట్నుంచీ ఆయన ఎవరో ఒక్కరితో క్లోజ్‌ కనెక్ట్‌ అవుతూ వస్తున్నారు. మొదట్లో జాఫర్‌, జాఫర్‌ వెళ్లాక మహేష్‌తో ఆయన క్లోజ్‌గా ఉంటున్నారు. అయితే, ఈ వారం కెప్టెన్సీ బాధ్యతల్లో ఉన్న ఆయన నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా, ఎలిమినేషన్స్‌ నుండి ఒకరిని సేవ్‌ చేసే క్రమంలో రవికృష్ణను సేవ్‌ చేశారు. ఇసుక టాస్క్‌లో రవికృష్ణ చాలా కష్టపడ్డాడని రీజన్‌ చెప్పారు.

 

అయితే, నిజానికి ఆ టాస్క్‌లో రవికృష్ణ తీరును హౌస్‌ మొత్తం తప్పు పట్టారు. చేతులతో ఇసుకను తీసి బయట వేయాలి.. కానీ, రవికృష్ణ షర్టు తీసి బయట వేశాడు. అలా చేయడం టాస్క్‌లో తప్పు. కానీ, ఆ టాస్క్‌లో రవికృష్ణ ఆడిన తీరు బాబా భాస్కర్‌ని చాలా ఇంప్రెస్‌ చేసేసిందట. ఆ కారణం చెప్పి, తన మనసుకు ఎంతో దగ్గరైన మహేష్‌ని సేవ్‌ చేయలేదు. తననెంతో ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తున్న శ్రీముఖినీ సేవ్‌ చేయలేదు. ఈ తీరు బాబా భాస్కర్‌ పట్ల గౌరవాన్ని తగ్గించేలా చేసింది. నామినేషన్స్‌ అనంతరం హౌస్‌లో చాలా మంది షాకయ్యారు. కానీ, తర్వాత తేరుకున్నారు. మహేష్‌ ఇదే విషయాన్ని శిల్పచక్రవర్తి వద్ద చెప్పి బాధపడ్డాడు.

 

బాబా భాస్కర్‌ స్ట్రేటజీ ఏంటో కానీ, ఆయన తీరు జనానికి మరోలా కన్‌వే అవుతుంది.. అని మహేష్‌ చెప్పాడు. మరోవైపు శ్రీముఖి కూడా బాబా తీరుపై చాలా సేపు షాక్‌కి గురైంది. ఆ షాక్‌ నుండి తేరుకోవడానికి కాస్తంత ఎక్కువే టైం పట్టింది శ్రీముఖికి. ఇక 'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' టాస్క్‌లోనూ బాబా చాలా చాలా ఓవరాక్షన్‌ చేసినట్లు కనిపించారు. నెటిజన్స్‌ నుండి బాబా భాస్కర్‌ పట్ల ఇదే అభిప్రాయం వెలువడుతోంది. ఏది ఏమైనా బాబా భాస్కర్‌ హౌస్‌లో ఉండేందుకు ప్లే చేస్తున్న స్ట్రాటజీలు ఒక్కోసారి హౌస్‌మేట్స్‌తో పాటు, నెటిజన్స్‌నీ షాక్‌లోకి తీసుకెళ్లిపోతున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS