గెట్‌ రెడీ ఫర్‌ 'ఆర్‌డీఎక్స్‌' బ్లాస్ట్‌!

మరిన్ని వార్తలు

'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాతో యూత్‌ని ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌'. పేరులోనే బ్లాస్టింగ్‌ ఉంది. కథలో కూడా అంతే పవరుంది. తొలి సినిమాతోనే బోల్డ్‌ కంటెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అనిపించుకున్న పాయల్‌ రాజ్‌పుత్‌ రెండో సినిమా కూడా అలాంటి కంటెంట్‌నే ఎలా ఎంచుకుంది..? అంటూ విమర్శలు ఎదుర్కొందిఈ సినిమా టీజర్‌తో. కానీ, ట్రైలర్‌ వచ్చాక బోల్డ్‌ హీరోయిన్‌ కాదు, ఈ జనరేషన్‌కి లేడీ సూపర్‌ స్టార్‌ అనే ముద్ర వేయించుకునే దిశగా ప్రశంసలు దక్కించుకుంటోంది.

 

టీజర్‌కీ, ట్రైలర్‌కీ అస్సలు సంబంధమే లేకుండా డిజైన్‌ చేశారు. సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. సెన్సార్‌ కూడా కంప్లీట్‌ అయిపోయింది. ఇక త్వరలోనే సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో ఎంత క్రేజ్‌ తెచ్చుకుందో, అంతకు మించిన క్రేజ్‌ ఈ సినిమాతో పాయల్‌కి దక్కుతుందనడం అతిశయోక్తి కాదనిపిస్తోంది. ఇదిలా ఉంటే, పాయల్‌ మరోవైపు సీనియర్‌ హీరో వెంకటేష్‌కి జోడీగా 'వెంకీ మామ' సినిమాలో నటిస్తోంది. అలాగే రవితేజతో నటిస్తున్న 'డిస్కోరాజా'లోనూ ఇంపార్టెన్స్‌ ఉన్న రోల్‌నే ఎంచుకుంది.

 

బోల్డ్‌ హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసినా, సమ్‌థింగ్‌ స్పెషల్‌ పాయల్‌ అనేలా మెల్ల మెల్లగా తన కెరీర్‌ని టర్న్‌ చేసుకుంటోంది పాయల్‌ రాజ్‌పుత్‌. ఆమె కెరీర్‌లో 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌' మరో మైల్‌ స్టోన్‌ కానుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా ఓ మంచి మెసేజ్‌ ఈ సినిమాలో ఉందనీ, యూత్‌ ఖచ్చితంగా ఆదరిస్తారనీ నమ్మకం వ్యక్తం చేస్తోంది అందాల పాయల్‌ రాజ్‌పుత్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS