బిగ్‌బాస్ చివరి స్టేజ్‌లో హౌస్ మేట్స్‌కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇంట్లోకి ప్రవేశిస్తారు. అయితే, ఆ సమయంలో ఇంటి సభ్యులు అనుకూలంగా లేని టాస్క్‌లో ఉంటారు. అంటే, రష్ అవర్, ప్రీజింగ్, స్లీప్ మూడ్ ఎక్సట్రా.. ఎక్సట్రా వంటి డ్రిల్ టాస్క్‌లన్న మాట. ఈ టైంలో కుటుంబ సభ్యుల్ని తనివి తీరా చూసుకోలేకపోతున్నామనే ఎమోషన్‌లో ఇంటి సభ్యులుంటారు. ఆ తరుణం తాజా సీజన్‌లో రానే వచ్చింది. తొలి గెస్ట్‌గా వితికా షెరూ చెల్లెలు హౌస్‌లోకి ప్రవేశించింది.
కానీ, ఆ టైంలో రష్ అవర్ డ్రిల్‌లో ఉంది వితిక. ఇంట్లోకి వచ్చిన చెల్లెల్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యింది. ఆ డ్రిల్ టాస్క్ నుండి రిలీజ్ అయ్యాక చెల్లెలితో కాసేపు మనసు విప్పి మాట్లాడింది. బాగా ఆడుతున్నారని అందర్నీ అప్రిషియేట్ చేసింది వితిక చెల్లెలు రితిక. ఆ తర్వాత అలీ రెజా భార్య హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరుణంలో హౌస్‌లో అలీ రెజా స్లీప్ మూడ్‌లో ఉన్నాడు.
తదుపరి మోస్ట్ ఎమోషనల్ గాళ్ ఆఫ్ ది హౌస్ శివజ్యోతి భర్త గంగూలీ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్న విషయాలకే కుళాయి విప్పేసే శివజ్యోతి, భర్త గంగూలీని చూసి, డ్యామ్ గేట్లే ఎత్తేసేలా ఉంది. అందుకే 'ఏడవద్దు.. నువ్వు ఏడిస్తే నేనెళ్లిపోతా..' అని గంగూలీ ముందుగానే శివజ్యోతిని హెచ్చరించాడు. అలా తాజా బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో కొంత ఎమోషన్ చోటు చేసుకుంది.