భారీ అంచనాల నడుమ, భారీ ప్రమోషన్స్‌తో విడుదలైన 'డియర్ కామ్రేడ్' మొదటి షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా డారుణంగా నష్టపోయిందనే టాక్ వినిపిస్తోంది. విజయ్ దేవరకొండకున్న స్టామినాతో, టాక్‌తో సంబంధం లేకుండా ఈ సినిమా మినిమమ్ గ్యారంటీ హిట్‌నైనా దక్కించుకుంటుందనుకున్నారు. కానీ, అలా జరగలేదు. సీన్ రివర్సయిపోయింది. కామ్రేడ్‌ని బొత్తిగా పట్టించుకోలేదు.
యూత్ తలచుకుంటే, ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేయగలరో విజయ్‌దేవరకొండ ఫ్యాన్స్‌ని చూసి అర్ధం చేసుకోవచ్చు. కానీ, ఎందుకో 'డియర్ కామ్రేడ్' విషయంలో ఏ ఒక్కటీ అనుకూలించలేదు. ఆఖరికి రౌడీస్ కూడా ఏమీ చేయలేకపోయారు. సో 'డియర్ కామ్రేడ్' పూర్తిగా నిరాశపరిచేసింది. ఫ్యాన్స్‌నే కాదు, ప్రొడ్యూసర్స్ కూడా ఇరకాటంలో పడిపోయారట ఈ సినిమా రిజల్ట్‌తో. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు ఏడాది పాటు సమయం తీసుకుంది.
రీ షూట్ల మీద రీ షూట్లు కూడా జరిగాయి. విడుదలయ్యాక కూడా రీ ఎడిటింగ్స్ జరిగాయట. కానీ, ఇవేమీ 'డియర్ కామ్రేడ్'ని గట్టెక్కించలేకపోయాయి. తన స్టామినాతో ఎలాగో ఓపెనింగ్స్ ఓకే అనిపించుకున్నా, లాంగ్ వీకెండ్‌నీ వినియోగించుకోలేకపోయాడు డియర్ కామ్రేడ్. ఇక ఈ వారం 'రాక్షసుడు', 'గుణ 369' సినిమాలు ఓ మోస్తరు పోజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో, ఇక 'డియర్ కామ్రేడ్' పుంజుకోవడం సాధ్యం కాదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు