ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా సింపుల్‌గా జరిగిపోయింది. 'రాళ్లే రత్నాలు' అనే టాస్క్ ద్వారా, ఎవరైతే తక్కువ రాళ్లు వెనకేసుకుంటారో వాళ్లని బిగ్‌బాస్ నేరుగా నామినేట్ చేశారు. అలా వరుణ్, రాహుల్, పునర్నవి, మహేష్ ఎలిమినేషన్ లిస్టులోకి వచ్చారు. అయితే ఈ నలుగురూ స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. ఈ నలుగురిలోంచీ ఎవరిని హౌస్ నుండి బయటికి పంపిస్తారు అనే ఉత్కంఠ రేకెత్తుతోంది. అయితే, వరుణ్, వితికలలో మొదట్నుంచీ వరుణ్‌తో పోల్చితే వితిక పర్‌ఫామెన్స్ ది బెస్ట్ అనిపిస్తుంది.
తాజా ఎపిసోడ్స్‌లో కూడా వితిక బెస్ట్ పర్‌ఫామెన్స్ ఇస్తోంది. సో వరుణ్, వితికలలో వితిక హౌస్‌లో ఉంచి, వరుణ్‌ని బయటికి పంపిస్తారేమో అనిపిస్తోంది. అలా వరుణ్‌కి ఎడ్జ్ ఉందనిపిస్తోంది. ఇక రాహుల్, మహేష్, పునర్నవిలలో రాహుల్, పునర్నవికి బయట చాలా ఫాలోయింగ్ ఉంది. అయితే, ఇద్దరూ నామినేషన్‌లో ఉండడంతో వీరిద్దరి ఓట్లు చీలిపోయే అవకాశాలున్నాయి. సో వీరిద్దరిలో ఎవరికి తక్కువ ఓట్లు పడతాయనేది కూడా ఊహించడం కష్టంగానే ఉంది. ఇకపోతే, ఈ మధ్య మహేష్ చాలా వీక్ అయినట్లు కనిపిస్తోంది.
టాస్క్‌ల్లో అంత యాక్టివ్‌గా పాల్గొనకపోవడంతో పాటు, స్క్రీన్ స్పేస్ కూడా మహేష్‌కి ఈ మధ్య తక్కువగా దక్కుతోంది. సో మహేష్ ఈ వారం ఇంటి నుండి వెళతాడా.? అనే అనుమానం కూడా కలుగుతోంది. సో టోటల్‌గా ఈ వారం ఎలిమినేషన్ కాస్త కష్టమే అనిపిస్తోంది. మరోవైపు ఈ వారం అసలు ఎలిమినేషన్ ఉండనే ఉండదు అనే టాక్ కూడా వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.