బిగ్ హౌస్‌లో విలన్‌గా ముద్ర వేయించేసుకుంది హిమజ. కారణం లేకుండా, సిల్లీ రీజన్స్‌తో హౌస్ మేట్స్‌తో గొడవకు దిగే హిమజ ఆటిట్యూడ్‌ని నెటిజన్లు మొదటి నుండీ తప్పు పడుతూ వస్తున్నారు. హౌస్ మేట్స్‌లో కూడా హిమజ ఆటిట్యూడ్ పట్ల కొంత నెగిటివిటీ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారణంతోనే ప్రతీ వారం హిమజ నామినేట్ అవుతూనే ఉంది. కానీ, ఫాలోయింగ్ పరంగా హిమజ ఏమంత తక్కువది కాదు.
నామినేషన్ నుండి తప్పించుకుంటూ వస్తోంది. అయితే, ఇక ఈ వారం హిమజ హౌస్ నుండి బయటికి వెళ్లక తప్పేలా లేదని తాజాగా అందుతోన్న సమాచారం. ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో ఉన్న మహేష్, పునర్నవి, హిమజలలో ముందుగా మహేష్‌ని సేవ్ చేసి, చివరాఖరికి పునర్నవి, హిమజల పేర్లు సస్పెన్స్‌లో ఉంచనున్నారట హోస్ట్ నాగార్జున. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఇద్దరి నుండీ పునర్నవి సేవ్ అవ్వగా, హిమజ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. ఏడో వారం హిమజ ఎలిమినేట్ అవుతుందని హౌస్‌లో బాబా భాస్కర్ ముందే జోస్యం చెప్పారు.
అయితే, ఇది ఇంకా ఆరో వారమే. మరి, బాబా భాస్కర్ జోస్యం ఫలించాలంటే పునర్నవిని అప్పుడే ఎలిమినేట్ చేసే ఛాన్స్ లేదు. సో మహేష్, హిమజలలో మహేష్‌ని బయటికి పంపించాలి. కానీ, హౌస్‌లో కొన్ని కాంట్రవర్సీలను సెంటర్ చేయాలంటే మహేష్ అవసరం ఖచ్చితంగా ఉందని బిగ్‌బాస్ యూనిట్ యోచిస్తోందట. అలా ఈ వారం ఎలిమినేషన్‌కి హిమజనే బలి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి, ఈ వారం హౌస్‌లో ఎవరి వికెట్ పడనుందో.?