46 రోజులుగా ఆసక్తిగా రన్ అవుతున్న బిగ్‌బాస్ సీజన్ 3 ఎలిమినేషన్ టైమ్ వచ్చేసింది. గతవారం వినాయక చవితి సందర్భంగా నో ఎలిమినేషన్ అంటూ గెస్ట్ హోస్ట్‌గా వచ్చిన శివగామి రమ్యకృష్ణ ప్రకటించడంతో, హౌస్‌లో ఆనందం వ్యక్తమైంది. కానీ, లేటెస్ట్ వీకెండ్‌లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ కావల్సిందే. ఎలిమినేషన్ లిస్టులో రాహుల్, రవికృష్ణ, ఆలీ రెజా, మహేష్, శ్రీముఖి ఉన్నారు. అయితే, వీరిలో శ్రీముఖిని ఎలిమినేట్ చేసే అవకాశమే లేదు.
ఇక రాహుల్‌కీ పెద్దగా ఎడ్జ్ లేదు. మహేష్ కూడా సేఫ్ జోన్ అనే సమాచారం ఉంది. ఇక అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రవికృష్ణ, అలీ రెజాలకే ఎడ్జ్ ఉందనీ వీరిద్దరి నుండీ ఎవరో ఒకరు బయటికి వెళ్లాల్సిందే అని తెలుస్తోంది. ఓటింగ్ ప్రకారం అలీ రెజాకి తక్కువ ఓట్లు వచ్చాయని తెలుస్తోంది. అయితే, ఓట్ల కౌంటింగ్‌ని తీసుకుంటే, తక్కువ ఓట్లు వచ్చినవారిని బిగ్‌బాస్ సేవ్ చేస్తున్నారు. ఫస్ట్ ఎలిమినేషన్ నుండీ ఇదే జరుగుతూ వస్తోంది. జాఫర్, హేమలలో తక్కువ ఓట్లు వచ్చిన హేమను ఎలిమినేట్ చేశారు.
అలాగే శివజ్యోతి, రోహిణి తీసుకుంటే, శివజ్యోతికే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ, రోహిణిని హౌస్ నుండి బయటికి పంపించారు. అదే ఫార్ములా ఫాలో చేస్తే, ఈ వారం హౌస్ నుండి బయటికి వెళ్లేది రవికృష్ణ అని ప్రచారం జరుగుతోంది. హౌస్‌లో మోస్ట్ ఎగ్రెసివ్‌గా ఉంటూ, వివాదాలకు వేదిక అయ్యే కంటెస్టెంట్‌గా అలీ పేరు తెచ్చుకున్నాడు. కానీ, రవికి మాత్రం కూల్ అండ్ కామ్ గై అనే పేరుంది. మరి ఈ మిస్టర్ కూల్‌ని కామ్‌గా ఇంటి నుండి పంపించక తప్పదా.? చూడాలిక.