భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఢీలా పడిన 'సాహో' సినిమాలో చందమామ కాజల్‌కీ ఓ ఛాన్స్ రావాల్సి ఉందట. జాక్వెలిన్ నటించిన స్పెషల్ సాంగ్‌లో మొదటగా కాజల్‌నే అనుకున్నారట. కాజల్‌కి తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ క్రేజ్ ఉండడంతో, స్పెషల్ సాంగ్ కోసం ఆమెని అనుకున్నారట. కానీ, లాస్ట్ మినిట్‌లో టెక్నికల్ రీజన్స్‌తో కాజల్‌ని తప్పించి జాక్వెలిన్‌ని తీసుకున్నారట.
ఆ టైంలో కాజల్ ఈ విషయమై చాలా బాధపడిందట. ఒకవేళ కాజల్ నటించినా, విడుదల తర్వాత 'సాహో' రిజల్ట్‌ని బట్టి, అది ఆమె కెరీర్‌కి పెద్దగా కలిసొచ్చేది కాదు. సో ఈ విషయం లేట్‌గా తెలుసుకున్న కాజల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మరోసారి తెలుగు సినిమా చరిత్రను తిరగ రాస్తుందని ఆశించిన 'సాహో' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంపై సాటి తెలుగు ప్రేక్షకుల్లా ఆడియన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, వారం రోజుల్లో 'సాహో' ప్రపంచ వ్యాప్తంగా 370 కోట్లు గ్రాస్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక బాలీవుడ్‌లో అయితే 110 కోట్లు వసూళ్లు సాధించి స్పీడ్ రన్‌లో దూసుకెళ్తోంది. కానీ, 'సాహో' క్రియేట్ చేసిన అంచనాలకు ఇది చాలదు. అంతకు మించి కావాలి. చూడాలి మరి, ఈ రన్ రేటు ఇలాగే కొనసాగి వసూళ్లు మరింత బెటర్ అనిపిస్తాయేమో.