బిగ్‌ ఎలిమినేషన్‌: అంతా షాకయ్యేలా!

మరిన్ని వార్తలు

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌లో ఏడవ ఎలిమినేషన్‌గా హ్యాండ్‌సమ్‌ అలీ రెజాని ఇంటి నుండి బయటికి పంపించారు. అలీని ఎలిమినేట్‌ చేయడం, హౌస్‌మేట్స్‌ అందరినీ కలిచివేసింది. హౌస్‌లోని వారెవ్వరూ అలీ ఎలిమినేషన్‌ని డైజెస్ట్‌ చేసుకోలేకపోయారు. హౌస్‌ మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. నిజానికి అలీ ఎలిమినేట్‌ అయితే, అంత మంది బాధపడతారని అలీ కూడా ఊహించలేదు.

 

ఆయన బయటికి వెళ్లే వరకూ నమ్మకం లేదంటూ చాలా సేపు షాక్‌లోనే ఉండిపోయారు. చివరికి హోస్ట్‌ నాగార్జున గట్టిగా కన్‌ఫామ్‌ చేసేసరికి ఒప్పుకోక తప్పలేదు. అలీ హౌస్‌ నుండి బయటికి వచ్చాక కూడా హౌస్‌ మేట్స్‌ ఏడుస్తూనే ఉన్నారు. 50 రోజులుగా హౌస్‌మేట్స్‌తో అంతలా విడదదీయరాని అనుబంధం ఏర్పడింది అలీకి. శ్రీముఖి, శివజ్యోతిని ఆపడం ఎవ్వరి తరం కాలేదు. ఎప్పుడూ ఏడవని రాహుల్‌ కంట కూడా కన్నీళ్లు రావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. అందుకే ప్రత్యేకించి రాహుల్‌ని 'నువ్వు కూడా ఏడుస్తావారా.?' అని అలీ అడగ్గా.. 'పైకి ఎలా ఉన్నా, లోపల వెరే రెస్పెక్ట్‌ ఉంటుంది బయ్‌.. అందుకే కన్నీళ్లు తెలియకుండా వచ్చేశాయ్‌..' అని హార్ట్‌ టచ్చింగ్‌ ఆన్సర్‌ ఇచ్చాడు రాహుల్‌.

 

మొత్తానికి 50 వరోజు ఎలిమినేషన్‌ చాలా భారంగా నడిచింది బిగ్‌ హౌస్‌లో. 50వ రోజు నుండి 'బిగ్‌బాంబ్‌' స్టార్ట్‌ చేశారు. రోజూ ఒక గంట పాటు జిమ్‌లో గడపాలనే బిగ్‌బాంబ్‌ని అలీ, రవిపై వేశాడు. బిగ్‌బాస్‌ చెప్పేంతవరకూ ఈ బిగ్‌బాంబ్‌ని క్రమం తప్పకుండా రవికృష్ణ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అయితే, బిగ్‌బాస్‌ ఆపమన్నాక కూడా ఇది కంటిన్యూ చేయమని, రవికి ఆలీ సూచించాడు. ఏమైనా డౌట్స్‌ ఉంటే, వరుణ్‌ భయ్యాని అడిగి తెలుసుకోమని రవికి ఆలీ సజెస్ట్‌ చేశాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS