బిగ్‌బాస్‌: విజేత ఎవరంటే.!

మరిన్ని వార్తలు

గత మూడు నెలలుగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న బిగ్‌బాస్‌ రియాల్టీ షో లాస్ట్‌ వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. టాప్‌ 5 లెవల్‌లో ఇప్పుడు పోటీ జరగనుంది. ఈ వారం బిగ్‌బాస్‌ ఇచ్చే టాస్కులు, వాటికి టాప్‌ 5గా ఉన్న ఐదుగురు ఇంటి సభ్యులు పెట్టే అఫర్ట్‌ మీదే వారి గెలుపు ఆధారపడి ఉంది. ఆరి అఫర్ట్‌ని బట్టి, బయటి నుండి ఆడియన్స్‌ వారికి తెలిపే మద్దతే గెలుపు తీర్పు కానుంది. ఇంతవరకూ జరిగిన ఎపిసోడ్స్‌ని బట్టి, బిగ్‌బాస్‌ విన్నర్‌ శివజ్యోతినే అన్నంత బిల్డప్‌ దిశగా సాగింది.

 

హౌస్‌ మేట్స్‌ అందరి నోటా శివజ్యోతి మాటే. అది చూసి, ఆడియన్స్‌ కూడా షాకయ్యారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ శివజ్యోతి తన్నుకెళ్లిపోతుందా.? అని ఆశ్చర్యపోయారు. కానీ, శివజ్యోతి ఎలిమినేషన్‌తో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక మిగిలిన ఐదుగురూ స్ట్రాంగెస్ట్‌ కంటెస్టెంట్సే. కానీ, వారిలో ఆలీకి కొంత ఎడ్జ్‌ ఉంది నెక్స్‌ట్‌ ఎలిమినేషన్‌కి. ఆ తర్వాత మిగిలిన నలుగురిలో హౌస్‌ నుండి బయటికి వెళ్లేది ఎవరనే విషయంపై అందరికీ సస్పెన్సే. చివరికి వచ్చేసరికి బాబా భాస్కర్‌కి విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చేసింది. ఇక వరుణ్‌, రాహుల్‌ సంగతి చెప్పనే అక్కర్లేదు. ఇక శ్రీముఖిని అయితే, బిగ్‌బాస్‌ విన్నర్‌ అంటూ సోషల్‌ వీరులు తేల్చేస్తున్నారు. అయితే, అనుకోకుండా జీరో నుండి హీరోగా మారిన రాహుల్‌, శ్రీముఖికి గట్టి పోటీ అవుతాడనే ప్రచారం తాజాగా తెరపైకి వచ్చింది.

 

కొన్ని సందర్భాల్లో రాహుల్‌కే బిగ్‌బాస్‌ టైటిల్‌ దక్కుతుందనే టాక్‌ కూడా ఆయన మద్దతుదారుల నుండి వినిపిస్తోంది. టాప్‌ 5 తేలిపోయింది. ఇక టాప్‌ 2.. ఈ టాప్‌ 2 కాంబినేషన్‌ శ్రీముఖి - వరుణ్‌, శ్రీముఖి - రాహుల్‌, శ్రీముఖి - బాబా భాస్కర్‌.. ఈ ఆర్డర్‌లోనే నడుస్తోంది. టోటల్‌గా శ్రీముఖి సెంటర్‌ ఆఫ్‌ ది టైటిల్‌గా కనిపిస్తోంది. ప్రీ క్లైమాక్స్‌లోనే సస్పెన్స్‌ వీడిపోయి, శుభం కార్డు పడిపోయిన సినిమాలా తయారైంది బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పరిస్థితి. ఇక చిట్ట చివరి వారానికి బిగ్‌బాస్‌ టైమింగ్స్‌ ఛేంజ్‌ అయిన సంగతి తెలిసిందే. రాత్రి 10 గంటల నుండి ఈ షో ప్రసారం కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS