దగ్గుబాటి రానా '1945' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శివకుమార్ ఈ సినిమాకి దర్శకుడు. తెలుగుతో పాటు, హిందీ తదితర భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు రానా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సినిమా ఫస్ట్‌లుక్ కూడా రిలీజ్ చేశాడు. ఐఎన్‌ఏ సైనికుడి పాత్రలో రానా ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఆసక్తికరంగా ఈ ఫష్ట్‌లుక్ డిజైన్ చేశారు. దేశభక్తి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు రానా నటిస్తున్న 'విరాటపర్వం' కూడా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమానే. నక్సలిజం, ఎమర్జెన్సీ తదితర ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది. వేణు ఉడుగుల ఈ సినిమాకి దర్శకుడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాణా హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశ్యప' అను పౌరాణిక మూవీ ఒకటి పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉంది. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించనున్నారనీ తాజా సమాచారం. గత కొంత కాలంగా అమెరికాలో ఉన్న రానా ఇటీవలే ఇండియాకి తిరిగొచ్చాడు. ఇక వరుస షూటింగ్స్‌తో బిజీ కానున్నాడు.