బన్నీ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరక్కెనున్న లేటెస్ట్‌గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కొరటాల శివ, సురేందర్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి విచ్చేశారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న రష్మికా మండన్నా ఈ ఈవెంట్‌కి హాజరు కాలేదు. షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా ఈవెంట్‌కి హాజరు కాలేకపోతున్నానని సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ చేసింది. అయితే, ఈ పోస్ట్‌కి నెటిజన్స్ నుండి భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ రష్మికపై దుమ్మెత్తి పోస్తున్నారు. అసలే సోషల్ మీడియా వేదికగా బన్నీ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా రచ్చ జరుగుతోంది.
ఈ తరుణంలో రష్మిక 'సరిలేరు నీకెవ్వరూ..' షూటింగ్ కారణంగా, బన్నీ సినిమా ఓపెనింగ్‌కి రాకపోవడంతో, ఫ్యాన్స్ అస్సలు ఊరుకోవడం లేదు. ఓ వైపు హీరోలు ఎప్పటికప్పుడే తమ మధ్య స్నేహ భావాన్ని చాటుకుంటూ, ఫ్యాన్స్‌కి మేమంతా ఒక్కటే అనే మెసేజ్ పాస్ చేస్తున్నా, ఫ్యాన్స్ మాత్రం ఆ విషయాన్ని సింపుల్‌గా పక్కన పెట్టేస్తున్నారు. ఎక్కడ లేని వైరాన్ని తమ మధ్య పెంచేసుకుంటున్నారు. ఫ్యాన్స్‌లో అవేర్‌నెస్ వస్తే తప్ప, ఈ విషయంలో తమ తమ అభిమాన హీరోలు కూడా ఇంతకన్నా ఏం చేయగలిగింది లేదు.
Sorry couldn't make it to the pooja ceremony because of shoots but looking forward to and exited ♥️@alluarjun
— Rashmika Mandanna (@iamRashmika) October 30, 2019
@MythriOfficial @aryasukku @ThisIsDSP #Miroslaw #AA20PoojaCeremony pic.twitter.com/roTyNJmths
అసలింతకీ ఈ రచ్చకి కారణం మహేష్, బన్నీల సినిమాలు ఒకేరోజు విడుదల కావడమే. హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం ఆ పోటీని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే, విడుదల దగ్గర పడే కొద్దీ ఇంకెలాంటి వింత పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలిక.