నయనతార పెళ్లి చేసుకోవడం ఖాయమేనా?

మరిన్ని వార్తలు

సౌత్‌ క్వీన్‌ నయనతార పెళ్లి పీటలెక్కనుందట. గత కొంత కాలంగా డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమ, సహజీవనం అంటూ ఎప్పుడూ హాట్‌ హాట్‌గా వార్తల్లో ఉండే, నయనతార త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు హల్‌చల్‌ చేస్తోంది. నిజానికి నయనతార పెళ్లి విషయం ఎప్పుడూ హాట్‌ న్యూసే. గతంలో శింబు, ప్రభుదేవాలతో పెళ్లి వరకూ వెళ్లి, బ్రేకప్‌ చేసుకున్న సంగతులు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత దర్శకుడు విఘ్నేష్‌తో లవ్‌, దాదాపు ఐదేళ్లుగా ఆయనతో డేటింగ్‌లో ఉంది నయనతార.

 

ఓ వైపు సినిమాల్లో బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా కొనసాగుతూనే, ప్రియుడితో కలిసి పర్సనల్‌ లైఫ్‌ని కూడా అంతే జాయ్‌ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తోంది. విదేశాల్లో వేడుకలు జరుపుకోవడం దగ్గర నుండి, తమ లైఫ్‌లో ఏ చిన్న మెమరీనీ విడిచిపెట్టకుండా ఖరీదైన గిఫ్ట్స్‌ ఇచ్చుకుంటూ, సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఈ జంట, త్వరలో పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది.

 

దర్శకుడిగా ఉన్న విఘ్నేష్‌, నయన్‌తో ప్రేమ తర్వాత నిర్మాతగానూ పరిచయమయ్యాడు. సో కెరీర్‌లో వెల్‌ సెటిల్డ్‌ అయిన ఈ జంట ఇక పెళ్లి ముడితో ఒక్కటవ్వాలనుకోవడం శుభ పరిణామమే. ఇక ప్రస్తుతం నయనతార అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ కూడా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. తెలుగులో నయన్‌ నటించిన 'సైరా' అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS