ఇప్పుడు కూడా బిగ్‌బాస్‌ 'క్యాష్‌' చేసుకోలేకపోయింది.!

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో స్పెషల్‌ గెస్ట్‌గా ఈ వారం ప్రముఖ యాంకర్‌ సుమ సందడి చేసిన సంగతి తెలిసిందే. సుమ షోలో ఉందంటే, చాలు ఆ షోకి ఎంత ఎనర్జీనో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి వారితోనైనా ఎంటర్‌టైన్‌ చేయించగల సత్తా సుమకు ఉంది. అలాంటిది బిగ్‌బాస్‌ షోలో ఇంతవరకూ వచ్చిన గెస్ట్‌లలో ఎవరూ లేనంత టైమ్‌ స్పేస్‌ సుమకిచ్చారు. సుమ ఎంట్రీతో బిగ్‌బాస్‌ ఎట్‌ లీస్ట్‌ ఈ వారం లేస్తుందని భావించారు. కానీ, సుమ కూడా బిగ్‌బాస్‌ని ఆదుకోలేకపోయింది.

 

అంత ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేసినా, సుమ పంచ్‌లు అక్కడక్కడా తప్ప, పూర్తిగా పేలలేదు.. అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. బిగ్‌బాస్‌తో ఎంటర్‌టైన్‌ చేయడం సుమ వల్లే కాలేకపోయింది. ఇక బిగ్‌బాస్‌ని లేపడం ఎవ్వరి తరం కాదనీ ఓ అంచనాకి వచ్చేస్తారు ప్రేక్షకులు. సుమ యాంకరింగ్‌లో నడుస్తున్న 'క్యాష్‌' తదితర షోలు రెట్టించిన ఉత్సాహంతో ఫుల్‌ ఆఫ్‌ ఎనర్జీతో నడుస్తుంటాయి. ఒకసారి 'క్యాష్‌' ప్రోగ్రామ్‌కి వచ్చిన బాబా భాస్కర్‌, సుమ కాంబినేషన్‌లో పేలిన పంచ్‌లు, జరిగిన రచ్చని ఆడియన్స్‌ మర్చిపోలేరు. అలాంటిది, అంత టైమ్‌ హౌస్‌లో ఉన్నప్పటికీ, ఎందుకో బాబా భాస్కర్‌ డల్‌గా ఉండిపోయారు.

 

శ్రీముఖి ఎప్పటిలాగే తన అరుపులతో కొంత మ్యానేజ్‌ (బోర్‌) చేసింది కానీ, ఇంకెవ్వరూ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. టాస్క్‌లో భాగంగా వరుణ్‌ సందేశ్‌ ఫర్వాలేదనిపించాడు. టోటల్‌గా సుమ గెస్ట్‌గా కూడా బిగ్‌బాస్‌ ఫెయిల్‌ అయ్యిందనే అంటున్నారు. ఇదిలా ఉంటే, ఫినాలే ఎపిసోడ్‌కి మెగాస్టార్‌ చిరంజీవిని గెస్ట్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. కానీ, బిగ్‌బాస్‌కి గెస్ట్‌గా వెళ్లొద్దంటూ ఫ్యాన్స్‌ చిరంజీవికి సూచిస్తున్నారనేది తాజాగా వినిపిస్తున్న మాట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS