బిగ్‌బాస్‌ హోస్ట్‌కి కోపమొచ్చింది.!

మరిన్ని వార్తలు

టాస్క్‌లు సరిగా చేయకపోతే, బిగ్‌బాస్‌ హౌస్‌ నియమాల్ని సక్రమంగా అనుసరించకపోతే, బిగ్‌బాస్‌ హర్టవుతారు. హర్ట్‌ అయ్యి ఊరికే ఉండరు. హౌస్‌మేట్స్‌ని పనిష్‌ చేస్తారు. లగ్జరీ బడ్జెట్‌ కట్‌ చేస్తారు. మరి హోస్ట్‌కి కోపమొస్తే ఏం చేస్తారు? హిందీ బిగ్‌బాస్‌ అయితే బిగ్‌బాస్‌ వదిలేసి వెళ్లిపోతున్నా.. అని భయపెడతారు. కానీ, 13 సీజన్స్ నుండీ ఆయనే బిగ్‌బాస్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారనుకోండి.

 

పేరు చెప్పకపోయినా ఆయన ఎవరో తెలియని వారుండరు. అవునండీ ఆయనే సల్మాన్‌ ఖాన్‌. తాజా ఎపిసోడ్‌లో ఆయనకి హౌస్‌మేట్స్‌ తీరుతెన్నులపై చాలా కోపమొచ్చిందట. దాంతో బిగ్‌బాస్‌ని వదిలేసి వెళ్లిపోతున్నా.. అని హౌస్‌మేట్స్‌ని బెదిరించారట. దాంతో హౌస్‌మేట్స్‌ ఏం చేయాలో తెలియక తెల్లమోహాలు వేసుకుని కూర్చున్నారు. హిందీ బిగ్‌బాస్‌ సంగతిలా ఉంచితే, మన తెలుగు బిగ్‌బాస్‌లోనూ ఇలాంటి సిట్యువేషన్‌ ఈ సీజన్‌లో చూశాం.

 

'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' అనే టాస్క్‌లో పునర్నవి 'బుల్‌ షిట్‌ టాస్క్‌' ఈ టాస్క్‌ నువ్వే ఆడుకో బిగ్‌బాస్‌..' అంటూ అరవడం, ఆ టాస్క్‌లో వరస్ట్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చినందుకు మహేష్‌, పునర్నవిలకు షూ పాలిష్‌ పనిష్మెంట్‌ ఇవ్వగా, ఆ పనిష్‌మెంట్‌ని స్వీకరించమని ఆ ఇద్దరూ భీష్మించుకుని కూర్చోవడం.. ఈ టైంలో హోస్ట్‌ నాగార్జున కూడా వారిపై అలిగారు. అయితే, ఈ అలకల చిలకలు ఓన్లీ ప్రోమోస్‌ కోసమేనండోయ్‌. తీరా చూస్తే అంత సీను లేదక్కడ. అలాగే ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌ అలక కూడా ప్రోమో కోసమే కావచ్చు. అసలు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూడాలంటే, షో చూడాల్సిందే మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS