బిగ్‌బాస్‌ హోటల్‌కి 'కళ' తిరిగొస్తుందా.?

మరిన్ని వార్తలు

'బిగ్‌బాస్‌ హోటల్‌' ప్రజెంట్‌ హౌస్‌లో రన్‌ అవుతోన్న టాస్క్‌ ఇది. ఒకప్పుడు బిగ్‌బాస్‌ హోటల్‌ కస్టమర్స్‌తో కళకళలాడిపోయేది. కానీ, ఇప్పుడు కళ తప్పింది. మళ్లీ ఆ కళ తీసుకురావడానికి మేనేజర్‌ వరుణ్‌ సందేశ్‌ ఆధ్వర్యంలో శ్రీముఖి, బాబా భాస్కర్‌, వితిక చెఫ్‌లతో, అలీ రెజా, రాహుల్‌, శివజ్యోతిల స్వీపింగ్‌ మెయింట్‌నెన్స్‌తో పూర్వ వైభవాన్ని పొందుతుందో లేదో తెలియాలంటే ఈ టాస&్క పూర్తయ్యేవరకూ బిగ్‌బాస్‌ వీక్షించాల్సిందే.

 

సో, ఈ టాస్క్‌లో భాగంగా మొట్ట మొదటగా బిగ్‌బాస్‌ హోటల్‌కి విచ్చేసిన వితికా షెరు చెల్లెలికి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ బాగానే సర్వీస్‌ చేసింది. తమ సర్వీస్‌ నచ్చితే, వచ్చిన అతిధులు హోటల్‌కి స్టార్‌ ఇచ్చి గౌరవించాల్సి ఉంటుంది. ఒక్క కస్టమర్‌కి ఒక్క స్టార్‌ ఇచ్చే ఛాన్స్‌ మాత్రమే ఉంది. సో మొదటి స్టార్‌ని వితిక చెల్లెలి రూపంలో బిగ్‌బాస్‌ హోటల్‌ దక్కించుకుంది. ఇక ఆ తర్వాత రానున్న అతిధి కస్టమర్లు బిగ్‌బాస్‌ హోటల్‌కి స్టార్స్‌ ఇస్తారా.? లేదో.? చూడాలి మరి.

 

ఇకపోతే, మిగిలిన ఇంటి సభ్యులతో పోల్చితే, స్వీపింగ్‌ సెక్షన్‌లో ఉన్న అలీ రెజా, రాహుల్‌ సిప్లిగంజ్‌ తాజా టాస్క్‌లో కాస్త నవ్వులు పండించే ప్రయత్నం చేశారు. 'టాపర్‌ ఆఫ్‌ ది హౌస్‌' టాస్క్‌కి సంబంధించి, తన కోసం రెండో స్థానాన్ని త్యాగం చేయడంతో రాహుల్‌ సిప్లిగంజ్‌కీ, అలీ రెజాకీ మధ్య ఎమోషనల్‌ బాండింగ్‌ ఏర్పడింది. దాంతో తాజా టాస్క్‌లో ఈ ఇద్దరూ లంబూ, జంబూల్లా కెమిస్ట్రీ పండించి, వీక్షకుల్ని నవ్వించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS