'బిగ్‌బాస్' ఇప్పుడీ రియాల్టీ షో గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో షోస్ నడిచాయి. తెలుగులో రెండు సీజన్లు పూర్తయ్యాయి. ఫస్ట్ సీజన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తే, రెండో సీజన్‌కి నాని హోస్ట్. ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ కారణంగా ఒకింత బాగానే నడిచింది. ఎన్టీఆర్ అల్లరి, ఆ షోకి హైలైట్. శివబాలాజీ విజేతగా నిలిచాడు.
సీజన్ 2 విషయానికి వస్తే, నాని తేలిపోయాడు. తన వంతుగా ప్రయత్నించినా ఎందుకో మ్యాజిక్ వర్కవుట్ అవ్వలేదు. విజేతగా నిలిచిన కౌషల్ ఓ రేంజ్‌లో స్టార్‌డమ్ తెచ్చుకున్నాడు. కౌషల్ ఆర్మీ లేకపోయి ఉంటే, బిగ్‌బాస్ సీజన్ 2 డిజాస్టర్ అయ్యి ఉండేదే. వెకిలితనానికీ, కుట్రలకీ బిగ్ హౌస్ కేరాఫ్ అడ్రస్ అనే విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితిలో కొత్త సీజన్ అంటే కొంత ఆశక్తితో పాటు, బోలెడన్ని అనుమానాలు తెరపైకి వస్తాయి.
హోస్ట్‌గా వెంకటేష్‌ని తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారట. కంటెస్టెంట్లుగా వివాదాస్పద వ్యక్తులనే ఎంచుకోవాలని భావించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే సీజన్ 2లో చాలా మంది తమ ఇమేజ్‌ని కోల్పోవల్సి వచ్చింది. బ్యాడ్ ఇంప్రెషన్ వేయించుకుని బయటికి వెళ్లారు. అలాంటి పరిస్థితులు సీజన్ 3లో రిపీట్ అవకుండా ఉంటాయని ఎలా అనుకోగలం.? వివాదాలే ఇలాంటి షోలకు టీఆర్‌పీ రేటింగులు తీసుకొస్తాయి.