అభిరుచి గల సినిమాలను తెరకెక్కించడంలో దిల్‌రాజు సిద్ధహస్తుడు. ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ దిల్‌రాజు బ్యానర్‌లో. అయితే గతేడాది దిల్‌రాజుకు పెద్దగా కలిసి రాలేదు. నితిన్‌తో చేసిన 'శ్రీనివాస కళ్యాణం' మూవీకి బాగా హైప్ క్రియేట్ అయ్యింది. కానీ ఆశించిన సక్సెస్ దక్కలేదు. అలాగే మెగా మేనల్లుడు తేజుతో 'తేజ్ ఐ లవ్ యూ' కూడా నిరాశపరిచింది. యంగ్ హీరో రాజ్‌తరుణ్‌తో 'లవర్' కూడా నిరాశపరిచింది.
చిన్నా చితకా డబ్బింగ్ మూవీస్‌ని కూడా తన బ్యానర్‌లో విడుదల చేసిన దిల్‌రాజు బాగా నష్టపోయారు. కానీ ఈ ఏడాది దిల్‌రాజు బ్యానర్ నుండి రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వెంకీ, వరుణ్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఎఫ్ 2' చిత్రాన్ని దిల్‌రాజు బ్యానర్‌లోనే రూపొందించారు. సంక్రాంతి దిల్‌రాజుకు బాగా కలిసొస్తుంది. సంక్రాంతికి విడుదల కానున్న 'ఎఫ్ 2'పై అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే సమ్మర్‌లో సూపర్‌స్టార్ మహేష్‌బాబు 'మహర్షి' విడుదల కానుంది.
ఈ రెండు భారీ చిత్రాలే. ముఖ్యంగా 'మహర్షి' మహేష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. సినిమాపై దిల్‌రాజు బాగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది రెండు భారీ చిత్రాలతోనూ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టడం ఖాయమంటున్నారు దిల్‌రాజు. ఇక ఈ రెండూ కాక, మరో మూడు సినిమాలను తన బ్యానర్‌లో దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారనీ తాజాగా ప్రకటించారు. టోటల్‌గా దిల్‌రాజు ఈ ఏడాది జోరు మీదే ఉన్నారు. చూడాలి మరి ఎన్ని సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకుంటారో.!