బిగ్‌ ఫైట్‌: ఈ సారి ఎవరి మధ్యనో తెలుసా?

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో ఈ వారం పెద్ద ఫైట్‌ జరగనుందని వీకెండ్‌ ఎపిసోడ్స్‌లో జరిగిన మాస్క్‌లు, మార్కులు టాస్క్‌ ద్వారా హింట్‌ దొరికినట్లయ్యింది. ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగంగా, నాగార్జున నిర్వహించిన ఫన్నీ గేమ్స్‌లో ఒకరికొకరు ఎదుటి వారి పట్ల తమకున్న అభిప్రాయాల్ని జన్యూన్‌గా బట్టబయలు చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో శివజ్యోతి, పునర్నవి మధ్య సైలెంట్‌ వార్‌ బయట పడింది.

 

ఇకపై సైలెంట్‌గా ఉండననీ, తానేంటో చూపిస్తానని పునర్నవికి ఛాలెంజ్‌ చేసినట్లు శివజ్యోతి ప్రవర్తించింది. ఈ సిట్యువేషన్‌ బట్టి, ఈ వీక్‌ హౌస్‌లో పునర్నవి, శివజ్యోతి మధ్య కొప్పుల యుద్ధానికి రంగం సిద్ధం కానుందని తెలుస్తోంది. అలాగే, శ్రీముఖి, ఆషూ మధ్య కూడా ఇలాంటి యుద్ధమే జరిగేందుకు అవకాశాలున్నాయి. ఇంతవరకూ సైలెంట్‌గా కనిపించిన ఆషూ రెడ్డి, రోహిణి విషయమై శ్రీముఖిని టార్గెట్‌ చేసినట్లు కనిపిస్తోంది.

 

సో అవకాశం చిక్కితే, ఖచ్చితంగా ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, శ్రీముఖిని ఇరికించేందుకు ఆషూ సెట్‌ చేసుకుంటుందనిపిస్తోంది. వీక్‌ అంతా డల్‌ మోడ్‌లో సాగిన, బిగ్‌బాస్‌కి నాగార్జున ఎంట్రీతో వీకెండ్‌లో జోష్‌ వచ్చిందనే చెప్పాలి. మాస్క్‌లు తీసేయాలి.. అనే టాస్క్‌తో వచ్చిన నాగార్జున, హౌస్‌ మేట్స్‌లో ఇన్ని రోజులుగా దాగున్న అపరిచితుల్ని బయటికి తీసుకొచ్చి, వీక్షకుల్లో కాసింత ఆసక్తి పెంచారు. ఆ ఆసక్తి, ఈ వారం బిగ్‌బాస్‌పై ఎలాంటి ఇంపాక్ట్‌ చూపిస్తుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS