డేరింగ్ గాళ్‌గా బిగ్‌హౌస్‌లో చెలామనీ అయిన హిమజ ఇటీవల హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బయటకి వచ్చిన హిమజ, బిగ్‌బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. హోస్ట్ నాగార్జునతో సహా, శ్రీముఖినీ కడిగా పారేసింది. షో చూడకుండానే నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారనీ ఆరోపించింది. అంతేకాదు, శ్రీముఖిపై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. శ్రీముఖి వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అనీ, హౌస్‌లోని వారిపై అదను దొరికినప్పుడల్లా పెత్తనం చెలాయించేందుకు శ్రీముఖి ట్రై చేస్తుందనే ప్రచారం సోషల్ మీడియాలో ఉన్న సంగతి తెలిసిందే.
అంతే కాదు, స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా శ్రీముఖికే దక్కుతోంది కూడా. అంటే, ముందే శ్రీముఖి బిగ్‌బాస్ టీమ్‌ని మ్యానేజ్ చేసి లోపలకు ఎంట్రీ ఇచ్చిందనే టాక్ కూడా ఉంది. అన్నింటికీ మించి, ఫిక్స్ శ్రీముఖిదే బిగ్‌బాస్ టైటిల్ అని కూడా నెటిజన్స్‌లో ఓ మోస్తరు అంచనా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా హిమజ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకూ, అంచనాలకూ బలం చేకూర్చేలా ఉన్నాయి.
'బిగ్‌బాస్‌కే బాస్వమ్మా..' అనే జింగిల్ రాయించుకున్నప్పుడే హౌస్‌లోని వారంతా షాక్ అయ్యారంటూ హిమజ చెప్పుకొచ్చింది. హౌస్‌లోని వారందర్నీ భయపెడుతూ, డ్యామినేట్ చేస్తూ, హౌస్‌లో శ్రీముఖి ఓవరాక్షన్ చేస్తోందంటూ హిమజ ఆరోపించింది. హిమజ ఆరోపణలతో శ్రీముఖి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.