అవినాష్‌కి 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' ఎందుకు దొరికింది.? అసలు ఆ పాస్ గురించి, ముందే ఎలా లీక్ అయ్యింది. ఆ పాస్ అవినాష్‌కి దక్కడం వెనుక పెద్ద కథే నడిచింది. అఖిల్‌ని లేదా మోనాల్‌ని సేవ్ చెయ్యాలి కాబట్టి, పక్కా ప్లానింగ్‌తో ఆ పాస్‌ని అవినాష్‌కి ఇచ్చారనీ, ఈ క్రమంలో పెద్ద డ్రామా నడిచిందనే ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం నిజం కాకపోతే, అచ్చంగా లీక్ ఎలా వచ్చిందో అలాగే జరిగింది మొత్తం వ్యవహారం.
రంగులు ముంచడం, ఆ రంగుల ఎపిసోడ్ ద్వారా ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేల్చడం వంటి విషయాలు కూడా లీక్ అయిపోతున్నాయి. బిగ్‌బాస్ అంటే అత్యంత పకడ్బందీగా నడిచే వ్యవహారం. పైగా, ఇది కరోనా సీజన్. ఇంకా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి, అలాంటప్పుడు లీకులు బయటకు రావడం అంటే.. కాస్త అనుమానించాల్సిన విషయమే.
ఈ వారం ఎవరి ఎలిమినేషన్ వుండదంటూ గత బుధ, గురువారాల్లోనే లీకులొచ్చాయి. అచ్చంగా అలానే జరిగింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నదానిపై కూడా వచ్చే బుధవారమో, గురువారమో లీకులు వచ్చేస్తాయి. ఇవన్నీ బిగ్‌బాస్ టీమ్ కావాలనే చేస్తోందని అనుకోవాలా.? ఎవరైనా ఎలాగైనా అనుకోనీ, ఈ లీకుల ద్వారా మాత్రం షోకి అనూహ్యమైన హైప్ క్రియేట్ అవుతోంది. కంటెస్టెంట్స్‌కి నాగ్ క్లాసులు పీకడం కూడా జస్ట్ షో పట్ల అటెన్షన్ తీసుకురావడానికేనేమో.!