శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ని తెలుగు చిత్రసీమకు తీసుకురావాలన్న ప్రయత్నాలు ఇప్పటివికావు. చాలామంది దర్శకులు ప్రయత్నించారు. కథలు చెప్పారు. కానీ అవేం వర్కవుట్ కాలేదు. ఇప్పుడు శ్రీదేవి రెండో కూతురు ఖుషీ కపూర్‌పై అందరి దృష్టీ పడింది. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న `పెళ్లి సందడి` సీక్వెల్‌లో... ఖుషీ కపూర్ నటించబోతోందన్న ప్రచారం మొదలైంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. గౌరీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఖుషీ ఫిక్సయ్యిందని టాక్.
అయితే... ఖుషిని చిత్రబృందం ఇప్పటి వరకూ సంప్రదించలేదని తెలుస్తోంది. ఖుషీని ఎంపిక చేద్దాం అనుకున్నా - ఆ ఆలోచన నుంచి విరమించుకున్నారని సమాచారం. ఓ కొత్తమ్మాయినే హీరోయిన్ గా ఫిక్స్ చేస్తారని, ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. సో.. శ్రీదేవి కుమార్తె ఎంట్రీ అన్నది రూమరే అన్నమాట. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 2021 జనవరిలో ఈ చిత్రం పట్టాలెక్కుతుంది. త్వరలోనే హీరోయిన్ ని ఫిక్స్ చేస్తారు.