బిగ్‌హౌస్‌లో హీరోయిజం చూపించిన వరుణ్‌ సందేశ్‌.

మరిన్ని వార్తలు

సినిమాల్లో లవర్స్‌ని కానీ, పెళ్లాల్ని కానీ ఏడిపిస్తే, హీరో ఏం చేస్తాడు. ఫైట్‌ చేస్తాడు. విలన్‌కి గట్టిగా బుద్ది చెప్తాడు. మరి రియల్‌ లైఫ్‌లో ఇలా జరిగితే? రియల్‌ లైఫ్‌ కాదు కానీ, రియాల్టీ షో బిగ్‌బాస్‌లో కూడా ఇదే సిట్యువేషన్‌ చోటు చేసుకుంది. అయితే, ఇక్కడ హీరో, విలన్‌ అని మెన్షన్‌ చేయలేం. కానీ, హౌస్‌లో అఫీషియల్‌ జోడీ వరుణ్‌ సందేశ్‌ - వితికా షెరుకి, తోటి హౌస్‌ మేట్‌ మహేష్‌ విట్టాకీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

 

అలాంటిలాంటి వాగ్వాదం కాదిది. ఏకంగా కొట్టుకునే దాకా చేరింది ఈ వివాదం. వరుణ్‌ సందేశ్‌కి తాను హీరోనన్న విషయం గుర్తొచ్చేసినట్లుంది కాసేపు. 'నా పెళ్లాన్ని అంటావా' అంటూ అన్‌ పార్లమెంటరీ లాంగ్వేజ్‌తో మహేష్‌ మీదికి దూసుకెళ్లాడు. మహేష్‌ కూడా ఏమంత తక్కువ తినలేదండోయ్‌. ఆయన శైలిలో ఆయన కూడా విరుచుకుపడ్డాడు.

 

ఫ్లోలో వరుణ్‌ని కామెడీ ఫేస్‌ అని అభివర్ణిస్తే, అవును నాది కామెడీ ఫేస్‌ ఇదిగో.. ఇంతే కామెడీగుంటది అని వరుణ్‌ వెటకారం చేస్తే, దానికి అవును నా గొంతింతే హార్ష్‌గానే ఉంటది అంటూ టైమింగ్‌ మిస్‌ కాకుండా, అదిరిపోయే పవర్‌ పంచ్‌ ఇచ్చాడు మహేష్‌. ఈ విషయమై సోషల్‌ మీడియాలో వాడి వేడిగా డిస్కషన్‌ నడుస్తోంది. మహేష్‌ విట్టా ఆర్మీకీ, వరుణ్‌ - వితికా ఆర్మీకి మధ్య సోషల్‌ రగడకు తెర లేపింది బిగ్‌బాస్‌లోని ఈ తాజా ఇష్యూ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS