'డియర్ కామ్రేడ్' సినిమాని కనీ వినీ ఎరుగని రీతిలో ప్రమోట్ చేశాడు విజయ్ దేవరకొండ. హాట్ సెన్సేషన్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మికా ఉత్సాహంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. రౌడీ తన ఆటిట్యూడ్‌తో అందరి దృష్టినీ తన వైపే ఉండేలా చేసుకున్నాడు. సో 'డియర్ కామ్రేడ్' విడుదలకు ముందే భారీ అంచనాల్ని నమోదు చేసింది.
ఈ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టాలన్న టార్గెట్‌తో విజయ్ దేవరకొండ రంగంలోకి దిగుతున్నాడు. ప్రమోషన్స్ మ్యాజిక్ సినిమాపై ఉన్న హైప్‌ని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. మ్యూజిక్ ఫెస్టివల్స్ పేరుతో విజయ్ దేవరకొండ, రష్మికా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాతో భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
'కామ్రేడ్' టీమ్ మొత్తం సినిమా విజయంపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. ప్రచార చిత్రాలతో ఇప్పటికే హోరెత్తించేస్తున్నారు. ఆడియో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరి 'డియర్ కామ్రేడ్' 100 కోట్ల టార్గెట్‌ని రీచ్ అవుతుందో లేదో తెలియాలంటే విడుదలయ్యాక టాక్‌ని బట్టి గానీ తేల్చలేం. అన్నట్లు ఈ సినిమాలో రష్మికా క్రికెటర్‌గా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్‌గా నటిస్తున్నాడు.