ఈరోజుతో బిగ్ బాస్ సీజన్ 2 ఆఖరి వారానికి చేరుకోనుంది. ఇప్పటికే ఇంటిలోకి వచ్చిన 17 మంది సభ్యులలో 11 మంది వెళ్ళిపోగా ఈరోజు ఇంకొక ఇంటి సభ్యుడు/రాలు ఇంటిని విడిచిపెట్టనున్నారు.
ఈ తరుణంలో నిన్న నాని వచ్చే ఎపిసోడ్ కోసం వీక్షకులు చాలా ఆసక్తితో ఎదురుచూశారు. దీనికి కారణం ఇంటిలో జరిగిన సంఘటనలు కాగా మరీ ముఖ్యంగా కౌశల్ ఒకవైపు మిగతా ఇంటి సభ్యులు మరోవైపు చేరి కొట్టుకోవడంతో వీటి పైన నాని తీవ్రంగా స్పందిస్తాడు అని అందరూ ఊహించారు.
దీనితో నిన్నటి ఎపిసోడ్ పైన అందరి ఆసక్తి నెలకొంది. కాని అందరి అంచనాలని పటాపంచలు చేస్తూ చాలా చప్పగా సాగింది మొత్తం ఎపిసోడ్. ఒకరకంగా చెప్పాలంటే బిగ్ బాస్ లో ప్రతి శనివారం ఉండే ఎపిసోడ్ లాగా ఇది లేదు అన్నది వినిపిస్తున్న టాక్.
అయితే నామినేట్ అయిన వారిలో ఎవ్వరిని కూడా సేఫ్ జోన్ లో పెట్టకుండా ఈరోజు వరకు సస్పెన్స్ ని కొనసాగించడం ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.