విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' చిత్రం రిలీజ్ డేట్ విషయంలో సోషల్ మీడియాలో ఓ పోల్ నిర్వహించాడు. ఆ పోల్ రిజల్ట్‌కి భిన్నంగా విజయ్ దేవరకొండ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు.
నిజానికి ఈ పోల్‌లో ఎక్కువ ఓట్లు 'ఏదీ కాదు' అన్న ఆప్షన్‌కి వచ్చాయట. అయితే అక్టోబర్ 5న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. 'ఏదీకాదు' అనే ఆప్షన్ తర్వాత '5' అనే ఆప్షన్‌కి ఎక్కువ ఓట్లు రావడంతో నిర్మాతలు ఈ డేట్‌ని ఫిక్స్ చేశారట. ఏది ఏమైనా 'నోటా' రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో అతని రౌడీస్ ఫుల్ హ్యాపీ.
రౌడీస్ అంటే ఏదో నెగిటివ్ అనుకోకండి. ఆయన ఫ్యాన్స్‌ని ముద్దుగా అలా పిలుచుకుంటున్నారు సోషల్‌మీడియాలో. 'నోటా' రిలీజ్ డేట్ ఫిక్సయిన తర్వాత సోషల్ మీడియాలో సందడి హోరెత్తిపోతోంది. రిలీజ్ డేట్ విషయమై జరిగిన రాద్ధాంతమంతా జస్ట్ పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని తేలిపోయింది. విజయ్‌దేవరకొండ అంతే ఏం చేసినా ఇలాగే ఉంటుంది.
ఇటీవల కాలంలో ఇంత తక్కువ టైంలో ఈ స్థాయిలో ఫామ్ సంపాదించుకున్నది విజయ్ దేవరకొండ మాత్రమే. ఆల్రెడీ 'గీత గోవిందం' సినిమాతో 50 కోట్లు దాటేశాడు. 'నోటా'తో 100 కోట్లు కొల్లగొట్టేస్తాడేమో చూడాలిక.