కూతురి విషయం ప్రస్తావనకు తెచ్చి, తన మానసిక స్థైర్యాన్ని ఇతర హౌస్‌మేట్స్ దెబ్బతీస్తున్నారనే భావనకు వచ్చిన కౌశల్, బిగ్ బాస్‌లో సంయమనం కోల్పోయాడు.
ప్రతిసారీ, కౌశల్ దగ్గర ఏదో ఒక అనవసర విషయం ప్రస్తావించి, అతన్ని టార్గెట్ చేయడం హౌస్‌మేట్స్ గేమ్ ప్లాన్‌లో భాగం కావొచ్చుగాక. హౌస్‌లో మిగతా హౌస్‌మేట్స్ అంతా ఓ అవగాహనకు వచ్చి, కౌశల్‌ని టార్గెట్ చేయడమే వివాదాలకు తావిస్తోంది. గేమ్‌లో గెలుపోటముల్ని డిసైడ్ చేసేవి ఈ ఎత్తుగడలే. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గనుక, కౌశల్‌ని తప్పించాలని ఇతర హౌస్‌మేట్స్ భావిస్తున్నారనుకోవచ్చు. అయినా కౌశల్ సంయమనం కోల్పోకుండా వుండాల్సింది.
అయితే, ఆ తర్వాత తేరుకుని అందరికీ 'క్షమాపణ' చెప్పేశాడు కౌశల్. ఆ తర్వాత కౌశల్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఏం చేసినా, తాను ఒక్కడినే గనుక.. టాస్క్‌పై ప్రభావం చూపలేనని తెలిసి చేతులెత్తేయాల్సి వచ్చింది కౌశల్‌కి. దాదాపుగా బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ టూ ఫైనల్‌కి వచ్చేసినట్లే. ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాల్సి వుంది.
కౌశల్ గనుక ఎలిమినేట్ అయిపోతే, ఆ తర్వాత హౌస్‌లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది వేచి చూడాల్సి వుంటుంది. కౌశల్ ఎలిమినేట్ కాకపోతే, మరోమారు బిగ్ హౌస్‌లో కొట్లాట పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. ఎందుకంటే, కౌశల్‌ని బయటకు పంపించడమే మిగతా హౌస్ మేట్స్ లక్ష్యం గనుక. ఇది బాబు గోగినేని వెళుతూ వెళుతూ మిగతా హౌస్ మేట్స్‌కి ఇచ్చిన ఆదేశం.