బిగ్‌బాస్ వీక్షించే వీక్షకులకు ఓ తాజా వార్త. ఇంతవరకూ రాత్రి 9 గంటల 30 నిముషాలకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ రియాల్టీ షో ఇకపై టైమ్ మార్చుకోనుందట. ఆ టైమ్ స్లాట్‌ని ఓంకార్ ప్రోగ్రామ్ ఆక్యుపై చేయనుందనీ తెలుస్తోంది. దాంతో రాత్రి 10 గంటల నుండి 11 గంటల సమయంలో బిగ్‌బాస్ ప్రసారం కానుందట. గత 95 రోజులుగా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ షో మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది.
అయితే, ఈ లోగా ఓంకార్ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వాల్సిన కారణంగా బిగ్‌బాస్ క్లైమాక్స్ షో టైమ్‌ని వెనక్కి పంపించాలని బిగ్‌బాస్ నిర్వాహకులే నిర్ణయించుకున్నారట. అసలే ఈ సీజన్ బిగ్‌బాస్‌కి అంతగా సీను లేదని ఆడియన్స్ తేల్చేవారు. అలాంటిది క్లైమాక్స్‌కి చేరిన బిగ్‌బాస్‌పై ఇలాంటి వార్తలు అంటే, చాలా బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పటికే బిగ్‌బాస్ గ్రాఫ్ చాలా డల్ అయిపోయింది.
లీకు వీరుల పుణ్యమా అని ఎలిమినేషన్స్‌లో సస్పెన్స్ లేకపోవడం, టాస్క్‌ల్లో పస లేకపోవడం, ఇదంతా బిగ్‌బాస్ గ్రాఫ్ పడిపోయేందుకు కారణమైంది. ఇక క్లైమాక్స్‌లోనైనా ఫాస్ట్‌గా నడిపిస్తారా? అంటే క్లైమాక్స్ మరీ నీరుగారిపోయింది. దాంతో ఈ షో టైమింగ్స్ మార్చాలని బిగ్‌బాస్ నిర్వాహకులే డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. దీపావళి తర్వాతి నుండి కొత్త టైమింగ్స్ అమలులోకి రానున్నట్లు తాజా సమాచారం.