ఈ వీకెండ్ ఫన్‌లో భాగంగా, హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్ అందరికీ కొన్ని అవార్డులు ప్రధానం చేశారు. అందులో మహేష్‌కి అగ్గి పుల్ల అవార్డునిచ్చాడు. అందరి మధ్యా పుల్లలు పెడతాడంటూ, ఆ అవార్డును మహేష్‌కిచ్చాడు నాగార్జున. సండే ఇది ఫన్‌డేగా అనిపించింది. కానీ, ఆ తర్వాత హౌస్‌లో ఈ అవార్డ్ ఇచ్చిన ఎఫెక్ట్ ఇద్దరు హౌస్ మేట్స్ మధ్య గొడవకు దారి తీసింది. బాబా భాస్కర్ నామినేషన్ విషయమై, అలీ, బాబా భాస్కర్ మధ్య డిస్కషన్ జరుగుతోన్న తరుణంలో బాబా భాస్కర్ భావజాలాన్ని మహేష్, అలీకి ఎక్స్‌ప్లైన్ చేసే ప్రయత్నం చేశాడు.
అలీ మధ్యలో కల్పించుకుని, నువ్వు పుల్లలు పెట్టొద్దు.. వెళ్లిపో అంటూ మహేష్‌పై గట్టిగా అరిచాడు. దాంతో కోపగించిన మహేష్ అక్కడి నుండి బయటికి వచ్చేశాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న రాహుల్ వద్ద తన అభిప్రాయం వెల్లిబుచ్చాడు. బాబా భాస్కర్‌కి లాంగ్వేజ్ ప్రాబ్లెమ్. ఫ్లోలో తమిళ్ వచ్చేస్తుంది. సో తాను అనుకున్నది కరెక్ట్‌గా కన్‌వే చేయలేడు. అందుకే నేను చెప్పబోయాను. ఐదుగురు కలిసి ఆయన్ని చుట్టేశారు. ఆయన మాట ఎలా నెగ్గుతుంది.? ఆయన తరపున సపోర్ట్ చేయడానికే వెళ్లాను ఆ మాత్రానికే పుల్లలు పెట్టేస్తావా.? అని అలీ రెచ్చగొట్టేలా మాట్లాడడం తప్పు. అన్నాడు. పదే పదే అలీ, మహేష్‌ని అవును నువ్వు పుల్లలు పెట్టావ్ అంటూ రెచ్చగొట్టాడు. దాంతో, మహేష్, అలీ మధ్య గొడవ గట్టి గట్టిగా అరుచుకునేంత పెద్దదైంది.
ఇదిలా ఉంటే, రాహుల్ కలగజేసుకుని, మీరు ఒక్క ఓటుకే అలా అయిపోతే. నాకు 8 ఓట్లు పడ్డాయ్. నేనెంతగానో నమ్మిన నా దోస్త్‌లే నన్ను నామినేట్ చేశారు. నేనేం చేయాలి. స్విమ్మింగ్ పూల్‌లో దూకి సూసైడ్ చేసుకోవాలి. నా నవ్వే నాకు శత్రువైంది. ఆ నవ్వే నన్ను ఇంతమంది హేట్ చేసేందుకు కారణమైంది. టాస్క్‌ల్లో సీరియస్‌నెస్ లేదనే కారణంగా నన్ను నామినేట్ చేశారు.. నేనేమనాలి చెప్పండి అంటూ బాబా భాస్కర్‌ని మోటివేట్ చేసే ప్రయత్నం చేశాడు రాహుల్. కరెక్టే కదా. రాహుల్ చెప్పినదాంట్లో ఖచ్చితంగా లాజిక్ ఉంది.