మారిన ట్రెండ్ నేపథ్యంలో సినిమా ఈక్వేషన్స్ మారిపోయాయి. తెలుగు సినిమా, హిందీ సినిమా, కన్నడ, తమిళ సినిమా అనే డిఫరెన్సెస్ లేకుండా పోయాయి. అంతా ఒక్కటే ఇండియన్ సినిమా. ఆ రకంగానే సినిమాల్లోని కంటెంట్ కూడా మారుతూ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్పుకోవల్సి వస్తుందంటే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రం బాలీవుడ్‌లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. దాదాపు 26 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమా బాలీవుడ్‌లో విడుదలవుతోంది.
గతంలో 'జెంటిల్‌మేన్', 'ప్రతిబంధ్' అనే రెండు స్ట్రెయిట్ హిందీ సినిమాల్లో చిరంజీవి నటించారు. కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారక్కడ. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత 'సైరా'తో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నందుకు చిరంజీవి చాలా ఎగ్జయిట్ అవుతున్నారు. నిన్న విడుదలైన 'సైరా నరసింహారెడ్డి' టీజర్ తెలుగు వెర్షన్‌కి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, హిందీ వెర్షన్‌కి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇచ్చారు.
గోసాయి వెంకన్నగా బిగ్‌బీ 'సైరా'లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ రిలీజ్ సందర్భంగా, ముంబయ్‌లో భారీ ఎత్తున ప్రెస్ మీట్ నిర్వహించింది 'సైరా' యూనిట్. ఈ ప్రెస్ మీట్‌లో బిగ్‌బీ, నయనతార మిస్సయ్యారు. కానీ, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా.. ఇలా పలువురు నటీనటులు పాల్గొన్నారు.