హిమజ 'బిగ్‌' విల'నిజం'.

మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో ఇంతవరకూ శ్రీముఖినే స్ట్రాటజీ ప్లాన్‌ చేస్తోందనీ, ఆ క్రమంలో విలన్‌గా మారిందనీ అనుకున్నాం. కానీ, శ్రీముఖి ఇన్‌ఫ్లూయెన్స్‌తో మరో కొత్త విలన్‌ హౌస్‌లో ఫామ్‌ అయ్యింది. ఆమె మరెవరో కాదు, అక్షరాలా హిమజ. మొదట్నుంచీ హౌస్‌లో హిమజ తన ఆటిట్యూడ్‌ చూపిస్తూనే వస్తోంది. అయితే, కూల్‌, కామ్‌ అని లైట్‌ తీసుకున్నాం కానీ, అమ్మో హిమజ అనేలా మారిపోయిందదిప్పుడు. అందర్నీ కార్నర్‌ చేస్తోంది. గేమ్‌లో తాను ముందుకు వెళ్లడానికి ఎవరినైనా బ్లేమ్‌ చేయడానికి వెనుకాడడం లేదు హిమజ.

 

అలా లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా హిమజ, పునర్నవినీ, ఆషూనీ టార్గెట్‌ చేసింది. ఇద్దరితోనూ వాదులాటకు దిగింది. నువ్వు మారాలి.. అంటూ పునర్నవికి సూచించింది. అషూతోనూ అంతే, అర్ధం పర్ధం లేని ఆర్గ్యుమెంట్‌ చేసింది. ఇక రాహుల్‌ విషయంలోనూ హిమజ తీరు అదేలా ఉంది. అంతేకాదు, కెప్టెన్‌గా అలీ విషయంలోనూ హిమజ తన సీరియస్‌ ఆటిట్యూడ్‌ని మెయింటైన్‌ చేసింది. కానీ, ఈ సారి హిమజపై ఆలీదే పై చెయ్యి అయ్యింది. కెప్టెన్‌గా హౌస్‌మేట్స్‌లో నలుగురిని నామినేట్‌ చేసే అవకాశం అలీకి వచ్చింది.

 

అయితే, ఫైనల్‌ వెర్షన్‌కొచ్చేసరికి హిమజ ఆల్రెడీ నామినేషన్‌ లిస్టులో యాడ్‌ అయ్యేసరికి, తనవంతుగా బాబా భాస్కర్‌ని నామినేట్‌ చేశాడు ఆలీ. అంతకు ముందు తనను నామినేట్‌ చేయొద్దని హిమజ, అలీని ఇంప్రెస్‌ చేయడానికి ట్రై చేసింది కానీ, అలీ కన్విన్స్‌ కాలేదు. కెప్టెన్‌గా తనకి కలిసొచ్చిన టైంని హిమజ విషయంలో బాగా యూజ్‌ చేసుకున్నాడు అలీ. అలీ కెప్టెన్‌ కావడంతో, తన నామినేషన్‌ ఆస్త్రాన్ని పునర్నవి, అషూ వైపు మళ్లించింది హిమజ. అలా మొత్తానికి శ్రీముఖి తర్వాత హిమజ, హౌస్‌లో కొత్త విలనిజానికి తెర లేపింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS