బిగ్‌హౌస్‌లో శ్రీముఖి తొలి రోజు నుండీ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అందరితోనూ సరదాగా కలిసిపోయినట్లు కనిపిస్తోంది. హౌస్‌లో చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటోంది. దాంతో శ్రీముఖి బలమైన కంటెస్టెంట్ అని అందరికీ అర్ధమైపోయింది. ఎలాగోలా శ్రీముఖిని బ్లేమ్ చేయాలని స్కెచ్ ప్రిపేర్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. శ్రీముఖిని ఎదురు దెబ్బ తీసేందుకు తోటి లేడీ హౌస్ మేట్సే రెడీ అవుతున్నారని చూస్తున్న ప్రేక్షకులకు అర్ధమయిపోతోంది.
కిచెన్ విషయంలోనూ, డైనింగ్ టేబుల్ వద్ద ఫుడ్ షేర్ చేసుకోవడంలోనూ శ్రీముఖి తోటి కంటెస్టెంట్స్‌కి ఇస్తున్న సూచనలూ, సలహాలూ అందరికీ నచ్చడం లేదు. అలా బాబా భాస్కర్ కోసం ఫుడ్ పక్కన పెట్టి ఉంచమని చెప్పిన శ్రీముఖికి రాహుల్ నుండి చుక్కెదురైంది. పర్టిక్యులర్‌గా బాబా భాస్కర్ గురించి ఎందుకు అంతలా కేర్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నా, పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్పాలి.. అంటూ రాహుల్ శ్రీముఖిపై గొడవకు దూకాడు.
రాహుల్ రియాక్షన్‌కి ఒక్కసారిగా రాములమ్మ బిత్తరపోయింది. కామ్ అప్ అయిపోయింది. ఆ తర్వాత బెస్ట్ ఫ్రెండ్ అంటూ రాహుల్‌ని కదిలించినా ఆయన కన్విన్స్ కాకపోవడంతో శ్రీముఖి మెంటల్‌గా కాస్త డిస్ట్రబ్ అయినట్లే కనిపించింది. సో హౌస్‌లోని పరిస్థితుల్ని తట్టుకుని శ్రీముఖి ఎలా నిలబడుతుందో. ఈ వారం తొలి ఎలిమినేషన్ నుండి శ్రీముఖి ఎలా తప్పించుకుంటుందో చూడాలిక.