రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' ఈ నెల 26న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు వసూళ్లు కుమ్మేశాడు కామ్రేడ్. సినిమాకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా కానీ, మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు 'డియర్ కామ్రేడ్' 10.72 కోట్లు షేర్ కొల్లగొట్టినంది. ఒక్క తెలుగు స్టేట్స్‌లోనే 7.2 కోట్లు కొల్లగొట్టేశాడీ రౌడీ కామ్రేడ్. నిజానికి ఈ సినిమాకి వచ్చిన టాక్‌కి ఈ రేంజ్ వసూళ్లు అంటే అంచనాలను అందుకున్నట్లే.
ఇది విజయ్ దేవరకొండ స్టామినా అని చెప్పక తప్పదు. అన్ని రకాల విడుదలకు ముందు పోజిటివ్ బజ్ క్రియేట్ చేసిన 'డియర్ కామ్రేడ్' విడుదలయ్యాక కొంత నిరాశపరిచినా, ఓపెనింగ్స్ పరంగా సక్సెస్ అయినట్లే. ఇక యూత్‌లో విజయ్ దేవరకొండకూ, రష్మికకు ఉన్న క్రేజ్‌తో వీకెండ్‌లో కామ్రేడ్ దున్నేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రెండో రోజూ ఇదే కొనసాగితే, విజయ్ దేవరకొండ మెల్లగా 100 కోట్ల టార్గెట్‌ని సొంతం చేసుకోవడం సులభమే అనిపిస్తోంది. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, బోనాల సందర్భంగా, తెలంగాణాలో సోమవారం సెలవు కావడంతో నైజాంలో కామ్రేడ్‌కి ఇంకా కలిసొచ్చే అంశమే. ఇక సినిమా విషయానికి వస్తే, తొలి సినిమాకే టేకింగ్ విషయంలో భరత్ కమ్మ మంచి మార్కులేయించుకున్నాడు. మ్యూజిక్ పరంగానూ 'డియర్ కామ్రేడ్' యూత్‌ని కట్టి పడేస్తోంది.