సంపూర్ణేష్ బాబు 'కొబ్బ‌రి మ‌ట్ట' ప్రీ రిలీజ్ బిజినెస్..!

By iQlikMovies - July 27, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

హ్రుద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో , కాలేయం లో త‌న స్థానాన్ని టెంట్ వేసుకుని ప‌డుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో హ్రుద‌య‌కాలేయం సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నం, మాట‌లతో కొబ్బ‌రిమ‌ట్ట అనే చిత్రాన్ని తీయాల‌న్న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చిన రూప‌క్ రొనాల్డ్ స‌న్ ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. సున్నిత‌మైన క‌థ‌ల‌తో చిత్రాలు నిర్మించి ప్రేక్ష‌కులకి గిల్లిక‌జ్జాలు పెట్టే సాయి రాజేష్ నిర్మాత‌గా దాదాపు 3 సంవ‌త్స‌రాల‌కు పైగా అత్యాధునికమైన సాంకేతిక నిపుణుల‌తో నిపుణుల పర్య‌వేక్ష‌ణ‌లో భారీ వ్యయం తో ఎక్కాడా కాంప్ర‌మైజ్ కాకుండా ఎండ‌న‌కా, వాన‌న‌కా, చ‌లిని సైతం త‌ట్టుకుని ప్రేక్ష‌కుడికి వినోదాన్ని అందించాల‌నే నిరంత‌ర కృషితో క‌సి తో చేసిని చిత్రం కొబ్బ‌రి మ‌ట్ట‌.

 

ఈ చిత్రంలో బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మూడు పాత్ర‌లు వేయ‌ట‌మే కాకుండా అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డు ని నెల‌కొల్పాడు.. ఈ చిత్రం లో పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు లాంటి అత్య‌ద్బుత‌మైన‌ పాత్ర‌లు చేసి మెప్పించ‌బోతున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం లో తెలుగు సినిమా లో వున్న న‌టీన‌టులంద‌రూ న‌టించారు.

 

ఈ సినిమా కి సంబందించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన అఆ.. ఇఈ అనే సాంగ్ యూట్యూబ్ లో రెండు మిలియ‌న్స్ వ్యూస్ 24 గంట‌ల్లో రావ‌టం ఈ చిత్రం పై సినిమా ల‌వ‌ర్స్ కి వున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. ఈ భారి చిత్రాన్ని అగ‌ష్టు 10 న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత భారి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.. ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌టంలో ఎక్క‌డా బారీయ‌ర్స్ లేని ఇంత‌టి క్రేజి చిత్రాన్ని నైజాం, ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ని నొబారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు సొంతం చేసుకున్నారు. 120 నిమిషాల ఈ చిత్రం లో యాక్ష‌న్‌, కామెడి, సెంటిమెంట్‌, రొమాన్స్‌, సందేశం, ఎమెష‌న్‌, ల‌వ్ లాంటి అన్ని జోనర్స్ క‌ల‌యికే ఈ కొబ్బ‌రిమ‌ట్ట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS