వరుణ్‌ - వితికలపై 'తమన్నాస్త్రం'.!

మరిన్ని వార్తలు

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బిగ్‌బాస్‌ రియాల్టీ షో. ఈ షో ప్రసారానికి ముందే బోలెడన్ని వివాదాలను ఎదుర్కోవల్సి వచ్చింది. ఇక ప్రసారమయ్యాక, బయటి వివాదాల సంగతి పక్కన పెడితే, హౌస్‌లో వివాదాలకు లోటే లేదు. డే వన్‌ నుండే హౌస్‌లో ఆసక్తికరమైన వివాదాలు చోటు చేసుకున్నాయి. వీటన్నింటికీ తోడు ట్రాన్స్‌ జెండర్‌ తమన్నా సింహాద్రి రూపంలో కొత్త వివాదం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

 

ఈమె ఎంట్రీ ఇస్తూనే, వరుణ్‌, వితికాలను టార్గెట్‌ చేసింది. మహేష్‌ విషయంలో వరుణ్‌ - వితికలు చేసింది చాలా తప్పు అని తమన్నా పేర్కొంది. తప్పు వాళ్లదయ్యుండి, మహేష్‌ సారీ చెప్పడం సబబు కాదని హౌస్‌ మేట్స్‌లో కొందరికి సూచించింది. అదే రీజన్‌తో వరుణ్‌ - వితికలను నామినేట్‌ చేసింది తమన్నా. అంతేకాదు, వరుణ్‌తో నేను ఓ ఆట ఆడుకుందామనే హౌస్‌లోకి వచ్చాను.. అంటూ హౌస్‌లో కొందరు మిగిలిన కంటెస్టెంట్స్‌తో తమన్నా చెప్పింది.

 

తమన్నా తీరు చూస్తే, ఫుల్ల్‌గా వరుణ్‌ - వితికాలను టార్గెట్‌ చేసినట్లే కనిపిస్తోంది. తమన్నా రాకతో, హౌస్‌లో పరిణామాలు ఎంత హీటెక్కనున్నాయో ఈ ఒక్కరోజు పరిణామాలతోనే అర్ధమయిపోయింది. ఇకపోతే, ఈ వారమే తమన్నా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో, ఈ వారం నామినేషన్స్‌లో తమన్నా పేరు లేదు. రాహుల్‌, శ్రీముఖి, హిమజ, మహేష్‌, వరుణ్‌, వితిక, పునర్నవి, జాఫర్‌ ఈ వారం నామినేషన్స్‌ లిస్టులో ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS