'డియర్ కామ్రేడ్'తో సౌత్ మొత్తం ఒకేసారి దున్నేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. అక్కడే బొక్క బోర్లా పడ్డాడు. ఓపెనింగ్స్ ఓకే అనిపించినా, తర్వాతి నుండి సినిమా వసూళ్లు బాగా డల్ అయిపోయాయి. ఎప్పుడో విడుదలైన 'ఇస్మార్ట్ శంకర్', 'డియర్ కామ్రేడ్' దెబ్బకి మళ్లీ పుంజుకుంది. ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ తమిళ, మలయాళ, కన్నడం అంటూ మిగిలిన భాషలపై కాన్‌సన్‌ట్రేషన్ మానేసి, వన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమాపై దృష్టి పెడితే బావుంటుందని ఆయన సన్నిహితులు సలహా ఇస్తున్నారట.
ఇలా నాలుగు భాషల్లో రిలీజ్ చేయడం కోసమే సినిమా రిలీజ్ కూడా లేటయ్యింది. అనుకున్న టైంకి సినిమా రాకపోవడంతో, ఆ ఇంపాక్ట్ కూడా సినిమా సక్సెస్‌పై పడింది. ఇక నటీనటుల్లో కూడా ఎక్కువ మంది మిగిలిన భాషలకు చెందిన వారుండడంతో అదో మైనస్ అయ్యింది. ప్రమోషన్స్ కూడా తెలుగులో కన్నా, మిగిలిన భాషల్లోనే ఎక్కువ చేసినట్లు కనిపించింది.
సో అలా తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన ఫలితాల్ని చవి చూసింది 'డియర్ కామ్రేడ్'. గతంలో 'నోటా ' విషయంలోనూ ఇలాగే జరిగింది. ఒక్కసారి దెబ్బ తిన్నాక కూడా విజయ్ దేవరకొండ మళ్లీ అదే పని చేయడం కొందరిలో అసహనాన్ని కలిగిస్తోంది. మొత్తానికి 'డియర్ కామ్రేడ్' అంచనాల్ని అందుకోవడంలో దారుణంగా విఫలమైందనే చెప్పాలి.