'బిగ్‌' స్టార్స్‌' ఆఫ్‌ ది హౌస్‌ వీరిద్దరే.!

మరిన్ని వార్తలు

హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ గొప్పతనాన్ని చాటుతూ స్టార్‌ మేళా నిర్వహించాడు, హౌస్‌లోకి వెళ్లిన హోస్ట్‌ నాగార్జున. హౌస్‌మేట్స్‌లో ఎవరు హౌస్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌కీ బెస్ట్‌ యాప్ట్‌ అనిపిస్తారో, వారికి స్టార్‌ ఇవ్వాలని సూచించాడు. అలా అలీ, మహేష్‌లు శివజ్యోతిని బెస్ట్‌ పర్‌ఫామర్‌గా నిర్ణయించి స్టార్‌ ఇచ్చారు. దాంతో శివజ్యోతికి రెండు స్టార్లు దక్కాయి. బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌, బెస్ట్‌ కుక్కర్‌ అంటూ శ్రీముఖి, బాబా భాస్కర్‌కి స్టార్‌ ఇచ్చింది.

 

తనకు బెస్ట్‌ ఫ్రెండ్‌, హౌస్‌లో కూల్‌ అండ్‌ కామ్‌ గై, బెస్ట్‌ థింకర్‌ అంటూ వరుణ్‌కి రాహుల్‌ స్టార్‌ ఇవ్వగా, 'బ్యాటిల్‌ ఆఫ్‌ ది మెడాలియన్‌' టాస్క్‌లో వితిక ఓర్పుకు మెచ్చిన వరుణ్‌ ఆమెకు స్టార్‌ ఇచ్చాడు. అలాగే వితిక, వరుణ్‌కిచ్చింది. తనకు బాధ కలిగినప్పుడు పక్కన ఉండి, వెన్ను తట్టే శ్రేయోభిలాషి అంటూ శ్రీముఖికి బాబా భాస్కర్‌ స్టార్‌ ఇచ్చాడు. టోటల్‌గా రెండేసి స్టార్లు వచ్చిన శివజ్యోతి, వరుణ్‌లు స్టార్స్‌ ఆఫ్‌ ది హౌస్‌గా ప్రకటించబడ్డారు. వీరిద్దరికీ ఈ వారం మొత్తం స్పెషల్‌ డిన్నర్‌ ఉంటుందని నాగార్జున తెలిపారు. ఆ తర్వాత కంటెస్టెంట్లు తమ పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించి మర్చిపోలేని సంఘటనలు, సాధించిన గొప్ప విజయాల్ని గురించి ఈ సందర్భంగా అందరితోనూ పంచుకోవాలని కోరారు.

 

ఆ క్రమంలో హౌస్‌ మేట్స్‌ అంతా కొంత భావోద్వేగానికి లోనయ్యారు. మొత్తానికి హౌస్‌లో సోగ్గాడు నాగార్జున ఓ మోస్తరు పండగ వాతావరణం కలిగించాడు. అయితే, గత సీజన్స్‌లో ఎన్టీఆర్‌, నాని కూడా ఒకానొక సందర్భంలో హౌస్‌లోకి వెళ్లి సందడి చేశారు. వారు హౌస్‌లోకి వెళ్లిన ఎపిసోడ్స్‌ వీక్షకుల్లో విపరీతమైన ఉత్తేజాన్ని పెంచాయి. సీజన్‌ మొత్తానికి మర్చిపోలేని అనుభూతిని మిగిల్చాయి. ఆ అంచనాల్ని అందుకోవడంలో, నాగార్జున చాలా చాలా తక్కువ స్కోర్‌ చేశాడన్నది నెటిజన్ల అభిప్రాయం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS