స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో 'అల వైకుంఠపురములో' సినిమా చేస్తున్నాడు. తదుపరి సుకుమార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాని దసరాకి స్టార్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ, దసరాకి అలాంటి సందడి కనిపించలేదు. పలువురు హీరోలు దసరా సందర్భంగా తమ తమ కొత్త సినిమాలను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించేశారు. కానీ, ముందుగా అనుకున్నట్టుగా సుకుమార్ - బన్నీ సినిమా మాత్రం స్టార్ట్ కాలేదు.
దాంతో, ఈ ప్రాజెక్ట్‌పై సర్వత్రా అనుమానాలు నెలకొంటున్నాయి. ఇంకా స్క్రిప్టు సిద్ధం కాలేదా.? లేక బన్నీనే సుకుమార్‌కి హ్యాండివ్వబోతున్నాడా.? లాంటి అనుమానాలు లేస్తున్నాయి. అయితే, తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం అలాంటిదేమీ లేదనీ, మరో మంచి ముహూర్తం చూసుకుని ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కిస్తారని అంటున్నారు. సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు బన్నీ. ఈలోగానే సుకుమార్ సినిమాని పట్టాలెక్కిస్తానని ఫ్యాన్స్‌కి ప్రామిస్ లాంటి ఓ మాటిచ్చేశాడు.
అంతేకాదు, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్ - కనబడుటలేదు' ప్రాజెక్ట్ కూడా సెట్స్ మీదికి తీసుకెళ్లాలనుకున్నాడు. అంతేనా.? మూడు సినిమాలు ఏక కాలంలో పూర్తి చేస్తాడని కూడా ఫ్యాన్స్ ఆశించారు. కానీ, త్రివిక్రమ్ సినిమా ఒక్కటే పట్టుకుని కూర్చున్నాడు.. అంటూ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఈ నిరాశా నిస్పృహల నుండి ఫ్యాన్స్‌ని బయటపడేసే బాధ్యత బన్నీ పైనే ఉంది. అలా జరగాలంటే ముందుగా అనుకున్నట్లే, ఆయా ప్రాజెక్టులు పట్టాలెక్కాల్సి ఉంది.